అక్రమ సంబంధం.. వివాహేతర సంబంధం.. ఎలా పిలుచుకున్నా కూడా ఈ చీకటి బంధాలు తెచ్చిపెట్టే తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. కట్టుకున్న వాళ్లను కాదని నీచపు సుఖాల మోజులో పడి పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. తుచ్యమైన పడక సుఖం కోసం జీవితభాగస్వాములను సైతం కడతేరుస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. అలాంటి చీకటి సుఖం కోసం తహతహలాడిన ఓ మహిళ కట్టుకున్న వాడ్ని కాదని ఇద్దరు ప్రియుళ్లను సెట్ చేసుకుంది. కానీ వారి కోరికలు తీర్చలేక అందులో ఒకర్ని హతమార్చింది. రెండోవాడి సాయంతో మృతదేహాన్ని మాయం చేసింది. చేసిన పాపం ఊరికే పోదుకదా.. అడ్డంగా దొరికేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కడలూరు జిల్లా సేతియాతోప్పు గ్రామంలో శివకుమార్ నివాసముంటున్నాడు. 20 ఏళ్ల క్రితం అతనికి మహాలక్ష్మితో వివాహం జరిగింది. వారికి 17 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. మొదట్లో బుద్ధిగానే కాపురం చేసుకుంది. కానీ, ఏ పురుగు తొలిచిందో.. బుద్ధ గడ్డి తినింది. భర్త వ్యాపారం మీద పొరుగూర్లు వెళ్తుంటాడు. అదే అదునుగా భార్య ఇంట్లో యవ్వారం మొదలు పెట్టేసింది. పరిచయస్తుడైన వేలుమురుగన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. పిల్లలు, భర్తలేని సమయం చూసి ప్రియుడ్ని ఇంటికే పిలిపించుకుని కామవాంఛలు తీర్చుకోవడం మొదలు పెట్టింది.
అక్కడితో ఆగకుండా.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని రహస్యప్రదేశాలకు కూడా వెళ్లడం మొదలు పెట్టారు. కొన్నాళ్లు ఈ తంతూ బాగానే సాగింది. కానీ, కొన్నాళ్లకు వేలుమురగన్ పై మహాలక్ష్మికి మోజు పోయినట్లు ఉంది. వెంటనే రామచంద్రన్ అనే మరో యువకుడిని వలలో వేసుకుంది. తన మాటలతో ముగ్గులోకి దించింది. ఇంక వేలుమురుగన్ వేలు వదిలేసి.. రామచంద్రన్ కు ఛాన్సులు ఇవ్వడం మొదలు పెట్టింది. కొన్ని రోజులు తర్వాత వేలుమురగన్ కు మహాలక్ష్మి- రామచంద్రన్ కనెక్ట్ అయ్యారనే విషయం తెలిసింది.
ఓ రోజు మద్యంతాగి మహాలక్ష్మి ఇంటికి వెళ్లి నువ్వు నాతో రావాల్సిందే.. నా కోరిక తీర్చాల్సిందే అని పట్టుబట్టాడు. ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ప్రతిఘటించిన మహాలక్ష్మి కర్రతో వేలుమురగన్ తలపై గట్టిగా కొట్టింది. అతను అక్కడికక్కడే మరణించాడు. వెంటనే రామచంద్రన్ కు ఈ విషయం చెప్పి మృతదేహాన్ని మాయం చేయాలనుకుంది. రామచంద్రన్- వేలుమురుగన్ శవాన్ని తీసుకెళ్లి పంచాయతీ ఆవరణలో విసిరేశాడు. మరుసటిరోజు మృతదేహం గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. శరీరంపై గాయాలు చూసి కర్రతో కొట్టడం, కత్తితో పొడవడం వల్లే వేలుమురుగన్ ప్రాణాలు పోయాయని గుర్తించారు. అతని కాల్ డేటా పరిశీలించగా.. మహాలక్ష్మికి ఎక్కువసార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. రామచంద్రన్ తో కలిసి హత్య, శవాన్ని మాయం చేసిన విషయాలు బయటకు వచ్చాయి. వెంటనే పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: దారుణం.. ఇంటర్మీడియట్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం!
అలవాటు పడిన ప్రాణం ఊరికే ఉంటుందా అన్నట్లుగా.. మొదట వేలుమురగన్ వేలు పట్టుకుంది. ఆ తర్వాత మోజు తీరిపోయి.. రామచంద్రన్ ను ఆకట్టుకుంది. ఇంకా కొన్నాళ్లు పోతే ఏ అభాగ్యుడిని ఆదరించేదో? ఆ అవకాసం లేకుండా పోలీసులు అరెస్టు చేశారు. కానీ, ఆ విషయం తెలిసి ఇంట్లో కుటుంబసభ్యులు ఎంత మనోవేదన అనుభవించారో మాటల్లో చెప్పలేం. ఇలాంటి వారికి ఎలాంటి కఠినశిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.