తాత్కాలిక సుఖానికి అలవాటు పడ్డ కొందరు యువతులు ఎంతకైన తెగిస్తున్నారు. పెళ్లికాకముందే ప్రేమాయణం అంటూ తిరగడమే కాకుండా శారీరక సుఖాలు తీర్చుకుంటూ చివరికి పుట్టిన బిడ్డలను చంపేస్తూ దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా ఇలాంటి అమానుష ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తంజావూరు జిల్లాలోని పుతలూరుకు సమీపంలోని అలక్కుడిలో ప్రియదర్శిని అనే 24 ఏళ్ల యువతి నివాసం ఉంటుంది. అయితే స్థానికంగా ఉండే ఓ పెళ్లైన మగాడితో ఈ యువతి ఎఫైర్ పెట్టుకుని తెర వెనుక సంసారాన్ని నడిపించింది.
అలా సాగుతున్న వీరి చీకటి కాపురంలో అనేక సార్లు శారీరకంగా కలుసుకున్నారు. అయితే కొన్నాళ్లకి ఆ యువతి గర్భందాల్చడంతో తంజావూరులోని ఓ ఆస్పత్రిలో చేరి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇంతటితో ఆగిందా అంటే అదీ లేదు. పుట్టిన ఆ పసిబిడ్డను అదే ఆస్పత్రిలో బాత్ రూంలోకి వెళ్లి చంపి టాయిలెట‌్ ఫ్లష్ ట్యాంక్‌లో పడేసి చేతులు దులుపుకుని పరారైంది. ఇక క్లీనింగ్ కోసమని వెళ్లిన ఆస్పత్రి పనివాళ్లు టాయిలెట్ ప్లష్ లో పసిబిడ్డ శవాన్ని చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
దీంతో వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రిలోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఆ ఫుటేజ్ లో ఓ మహిళ బాత్ రూంలోకి బిడ్డతో వెళ్లి ఆ తర్వాత ఒంటరిగా రావడంతో నిందితురాలు ప్రియదర్శని అని తేలింది. దీంతో పోలీసులు నిందితురాలు ప్రియదర్శిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా తంజావూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తాత్కాలిక సుఖాలకు అలవాటు పడి పుట్టిన బిడ్డను చంపేసిన దుర్మార్గురాలిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.