ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు సంబవించడం.. పదుల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని.. కేసులు పెట్టినా.. జరిమానాలు వేసినా ఏలాంటి మార్పు రావడం లేదని అధికారులు అంటున్నారు. ముగ్గురు విద్యార్థులను కారు రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలోకు చెందిన రఫీక్, విజయ్, సూర్య వీరిద్దరూ అన్నదమ్ములు. ముగ్గరు 13 ఏళ్ల వయసు వాళ్లు. ఇద్దరు అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి రఫీతో మంచి స్నేహితులుగా ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా ముగ్గురు కలిసి వెళ్తుండేవారు. మంగళవారం హైవే పై ఉన్న సర్వీస్ రోడ్డు వెంట సైకిళ్ళు తొక్కకుంటూ వెళ్తున్నారు. అనుకోకుండా ముగ్గురు స్నేహితులపై ఎస్ యూవీ వాహనం వేగంగా దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు స్పాట్ లోనే చనిపోయారు.
స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు స్నేహితులు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులపైకి దూకించిన కారు డ్రైవర్ కాలేజ్ స్టూడెంట్ గా గుర్తించారు పోలీసులు. తన స్నేహితులతో విహార యాత్రంకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి అటుగా వెళ్తున్న ముగ్గురు బాలురపైకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో స్డూడెంట్ మద్యం సేవించి లేడని చెప్పారు. పలు సెక్షన్ల కింద నింధితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.