నేటి కాలంలో వివాహేతర సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పైగా వావివరసలు మరిచిన కొందరు వివాహితలు బరితెగించి ప్రవర్తిస్తూ సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలో ఓ వదిన సొంత మరిదితో వివాహేతర సంబంధాన్ని నడిపిన ఘటన చివరికి విషాదంగా మారింది. తాజాగా తమిళనాడులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కళ్లకురిచి జిల్లాకు చెందిన ప్రభు, మంజు ఇద్దరు భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. అయితే ఉద్యోగరిత్యా భర్త విదేశాల్లో ఉండగా భార్య పిల్లలతో ఇంట్లో ఉంటుంది. అయితే ప్రభుకు విజయ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇతను ఇంటివద్దే తల్లిదండ్రులతో పాటు ఉంటున్నాడు. ఇక అసలు విషయం ఏంటంటే..? భర్త లేకపోవడంతో భార్య మంజు మరిది విజయ్ తో కాస్త క్లోజ్ గా ఉండేది. రాను రాను వీరిద్దరి మధ్య కాస్త ప్రేమ చిగురించినట్లైంది.దీంతో సమయమున్నప్పుడల్లా వదినామరిది నట్టింట్లోనే తెగ ఎంజాయ్ చేసేవారు. ఇక అప్పడప్పుడు ఏర్కాడ్ ప్రాంతానికి వెళ్లి అక్కడున్న లాడ్జ్ లో సేదతీరేవారు. అలా కొంత కాలం వీరి చీకటి సంసారం ఎంచక్కా ఘనంగా సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ రోజు మళ్లీ ఏర్కాడ్ ప్రాంతంలోనే లాడ్డ్ కు వదినా మరిది భార్యాభర్తలమని చెప్పి అందులో దూరిపోయారు. అయితే నైట్ అర్థరాత్రి వరకు ఇద్దరు మద్యం సేవించి ఎంజాయ్ చేశారు. అదే రాత్రి వదినతో మరిది.. నాకు పెళ్లి కుదిరింది, ఇక నుంచి మనం కలవడం కుదరదంటూ వదినకు షాకింగ్ న్యూస్ చెప్పాడు.
ఇది కూడా చదవండి: నాలుగేళ్ల పగ తీర్చుకున్నారు! దేనికో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది!
ఇదే విషయంపై ఇద్దరు కాసేపు గొడవ కూడా పడ్డారు. అలా ఇద్దరు వాగ్వాదానికి దిగి కొద్దిసేపటి తర్వాత నిద్రలోకి జారుకున్నారు. వేకువజామున సమయం 3 అవుతుంది. మరిది కళ్లు తెరిచి చూశాడు. పక్కన బెడ్ పై వదిన లేదు. వాష్ రూంలోకి వెళ్లిందేమోనని కాసేపు వేచి చూశాడు. అయినా ఎంతకు బయటకు రాలేదు. దీంతో బాత్రూం తలుపు కొట్టాడు. లోపల గడియా పెట్టినట్లు ఉందని ఆ బాత్రూం తలుపులు బద్దలు కొట్టి చూస్తే నగ్నంగా ఉరేసుకుని వదిన విగతజీవిలా పడుంది. దీంతో మరిది విజయ్ షాక్ గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశిలించి కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.