భార్యాభర్తల అనోన్య జీవితంలో వివాహేతర సంబంధాలు చేరి పచ్చటి సంసారాలను నాశనం చేస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇలా తెరచాటు సంసారాలకు అలవాటు పడి సొంత సంసారాలను పక్కకు పెడుతున్నారు. అక్రమ సంబంధాల మైకంలో పడి కొంతమంది వివాహితలు పుట్టిన పిల్లలను, భర్తను కాదని ప్రియుడితో చెక్కేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై నగర పరిసర ప్రాంతంలో రజియా అనే మహిళకు చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బలంగానే ఉన్నాడు. అయితే కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. దీంతో వీరి కుటుంబం ఎంతో సంతోషంగానే సాగుతూ ఉంది. ఇక సమయం దొరికినప్పుడల్లా భర్తతో రజియా బయటకు వెళ్లి షికారు చేయడం, ఫ్రేండ్స్ తో కూడా బాగానే ఎంజాయ్ చేసేది. మరో విషయం ఏంటంటే..? అలా తన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్న క్రమంలో రజియాకు ఓ ఆటో డ్రైవర్ పరిచయమయ్యాడు.అయితే ఆటో డ్రైవర్ తన కంటే 13 ఏళ్లు చిన్నవాడు కావడం విశేషం. ఇక వీరిద్దరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఎంచక్కా ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోవడం, సమయం దొరికినప్పుడల్లా బయట షికారు చేస్తూ ఉండేవారు. అలా రాను రాను వీరిద్దరి బంధం బలంగా మారింది. రజియా ప్రియుడి మైకంలో పడి భర్తను బిడ్డలను కూడా మరిచిపోయేంతగా తయారైంది. దీనికి తోడు భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పైసా పైసా కూడబెట్టి భార్యకు ఇచ్చేవాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రోజులు గడిచే కొద్ది రజియాకు భర్తపై ప్రేమ తగ్గి ప్రియుడిపై పెరుగుతూ వచ్చింది. ఇక ప్రియుడితోనే ఉండాలనుకున్న భార్య రజియా భర్తకు షాక్ ఇస్తూ ఇటీవల ప్రియుడితో లేచిపోయింది. వెళ్తూ వెళ్తూ.. ఇంట్లో ఉన్న రూ.47 లక్షలు భారీ నగదుతో పాటు బంగారం కూడా వెంట తీసుకెళ్లింది. దీంతో షాక్ అయిన భర్త తన భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం నగరం అంతా గాలిస్తున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బాగా రిచ్ గా ఉన్న భర్తను కాదని ఆటో డ్రైవర్ తో వెళ్లిపోయిన భార్య రజియా తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.