ఆమె పేరు అన్నపూర్ణి. పెళ్లైంది ఓ కూతురు కూడా ఉంది. భర్తతో పాటు హాయిగా సాగుతున్న కాపురంలో ఆ మహిళ సడెన్ గా రూట్ మార్చి తను ప్రేమించిన ప్రియడితో భర్తను, కూతురిని కాదని అతనితో పాటు లేచిపోయింది. కట్ చేస్తే అన్నపూర్ణి ఇప్పుడు కాళీమాతగా అవతారమేత్తింది. అసలు ఇన్ని రోజులు ఎక్కడుంది. కాళీమాతగా అవతారమెత్తడానికి కారణమేంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2014లో ఓటీవీ ఛానల్ వేదికగా జరిగిన అలుమగల పంచాయితీలో అన్నపూర్ణి ఒక బాధితురాలు. భర్తతో విడిపోతానని, విడాకులు కావాలని టీవీ షోలో పాల్గొన్నప్పుడు అన్నపూర్ణి చెప్పిన వీడియోలు ఇప్పుటికీ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఆ వివాహిత మొదట్లో పెళ్ళి చేసుకుని కూతురు కూడా ఉన్నప్పటికీ ప్రియుడే కావాలంటూ భర్తకు విడాకులిచ్చి అతనితో వెళ్లిపోయింది. అలా కొంత కాలం అతనితో పాటే ఉన్న ఈ మహిళ సడెన్ గా కాళీమాతగా అవతారం మెత్తి భక్తుల కోరికలు నెరవేర్చుతుంది. ఈ విషయం తెలిసిన స్థానికులు, బంధువులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ లోని ఓ కల్యాణ మండపం వేదిక అన్నపూర్ణి అరసు మాతాజీగా అవతారమెత్తడంతో జనాలు ఆమెకు పూజలు చేస్తున్నారు. అన్నపూర్ణి కూడా దేవతగా అవతారమెత్తి భక్తుల కోరికలు తీరుస్తున్నట్లు అనేక వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఇక మరో విషయం ఏంటంటే..? జనవరి 1వ తేదీన దివ్య దర్శనం పేరుతో అన్నపూర్ణి భక్తులకు ఉపదేశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను పట్టుకునేందుకు పరుగులు తీశారు. దీంతో హాటాహుటిన అంతా సర్దుకున్న అన్నపూర్ణి పోలీసుల కళ్లు గప్పి కనిపించకుండా పారిపోయింది. దీంతో పోలీసులు ఆమెను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు. అసలు ఎవరీ అన్నపూర్ణి. ఎందుకు దేవతలా మారిందంటూ నెటిజన్స్ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తమిళనాడులో జరిగిన ఈ ఘటన స్థానికంగా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అన్నపూర్ణి దేవతగా మారిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.