సమాజంలో ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కొందరు మాస్టారులు తూట్లు పొడుస్తు అపవిత్రపాలు చేస్తున్నారు. బడిలో పాటలు చెప్పాల్సింది పోయి అదే పిల్లలను ఉపాధ్యాయులు కామంతో లైంగిక వేధింపులకు గురి చేస్తూ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామనాథపురం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్స్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకరు మ్యాథ్స్, మరొకరు సోషల్ సైన్స్ పాఠాలు చెబుతున్నారు. అయితే చదువులు చెప్పాల్సిన ఈ ఇద్దరు మాస్టారులు బుద్ది వక్రమార్గంలోకి నెట్టేస్తూ బరితెగించి ప్రవర్తించారు. 8,9,10 తరగతి అమ్మాయిల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వారి ఒంటిపై చేతులు వేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
దీనిని తట్టుకోలేక పోయిన ఆ 15 మంది విద్యార్థులు దురుసుగా ప్రవర్తించిన టీచర్ల తీరును అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఇదే విషయాన్నిపోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఓ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి మరో ఉపాధ్యాయుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కలిగిన ఉపాధ్యాయులే ఇలా బరితెగించి ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.