నేటి కాలంలోని తల్లిదండ్రులు కనిపెంచిన కొడుకు, కూతుళ్లకు ఘనంగా పెళ్లిళ్లు చేయాలని ప్రతీ తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. పెళ్లిళ్లై వారి పిల్లలతో హాయిగా గడపాలని అందరి తల్లిదండ్రుల కోరిక. కానీ బాగా చదువుకున్న యువతులు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దాక పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. అలా ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్న కొందరు యువతులు తట్టుకోలేకపోతున్నారు. ఇక అంతటితో ఆగకుండా కట్టుకున్న వాడిని హత్య చేయటం, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు.
అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తేనీ జిల్లా కంభం కురంగ్‌మయాన్ వీధికి చెందిన గౌతమ్ అనే యువకుడితో గత నెల 10వ తేదీన అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరి అనే యువతితో వివాహం జరిగింది. తల్లిదండ్రులు కుదుర్చిన వివాహం కావడంతో పెళ్లి ఘనంగానే చేశారు. కానీ ఈ పెళ్లి భువనేశ్వరికి అస్సలు ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రుల ఇష్టాన్ని కాదనలేక అలాగే చేసుకుంది. ఇక పెళ్లై వారం రోజులు గడిచింది. ఏదో తెలియని వెలితి భువనేశ్వరిని వెంటాడుతోంది.
ఏం చేయాలో అర్థంకాని పరిస్థితులు చుట్టుముట్టాయి. ఇక భర్తతో గడపడం ఇష్టంలేని యువతి ఏకంగా భర్త మర్డర్ కే ప్లాన్ వేసింది. మరో విషమం ఏంటంటే..? గోవిందంపట్టి ప్రాంతానికి చెందిన నిరంజన్ అనే 22 ఏళ్ల యువకుడితో భువనేశ్వరి చాలా కాలం నుంచి స్నేహంగా ఉండేది. ఇక ఆమె పెళ్లి చేసుకోవడం నిరంజన్ కు కూడా ఇష్టం లేదు. అయితే భువనేశ్వరి పెళ్లికి ఇచ్చిన బంగారాన్ని బ్యాంకులో కుదువబెట్టి నిరంజన్ కు రూ. 75,000 ఇచ్చి తన భర్తను చంపమని ప్లాన్ వేసింది. దీనికి నిరంజన్ కూడా సై అన్నాడు. ఇక అనుకున్నట్లుగానే భువనేశ్వరి తన భర్తతో ఓ రోజు బయటకు వెళ్దామని చెప్పి ఇద్దరు బైక్ పై వెళ్లారు.
ఇక అటు నుంచి నిరంజన్ తన స్నేహితులతో కారులో వస్తున్నాడు. భువనేశ్వరి భర్తతో పాటు వెళ్తున్న బైక్ పంక్చర్ కావడంతో రోడ్డుపై నెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇది గమనించిన నిరంజన్ కారులోంచి దిగి భువనేశ్వరి భర్తను చితకబాది అదే కారులో పరారయ్యారు. ఇక మరుసటి రోజు భువనేశ్వరి భర్త ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నాపై దాడికి తెగబడ్డారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుల విచారణలో దాడి చేసింది భువనేశ్వరి స్నేహితులని తేలింది. కాగా భువనేశ్వరి అనుకున్న ప్లాన్ బెడిసికొట్టడం, పైగా తను చేసిన యవ్వారం బయటపడింది. ఏం చేయాలో తెలియక ఇటీవల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడి చివరికి ప్రాణాలు తీసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న భువనేశ్వరి భర్త హత్యకు ప్లాన్ వేసి చివరికి తను ప్రాణాలే తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.