పెద్ద చదువులు చదివిన యువతికి పెళ్లి చేయాలని ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఇక ఆ యువతి వచ్చిన సంబంధాలను చెడగొడుతూ ప్రేమించిన యువకుడినే చేసుకుంటాననని పట్టుబట్టింది. దీంతో కోపంతో రగిలిపోయిన తమ్ముడు పెళ్లి సంబంధాలను చెడుగొడుతున్న అక్కపై దారుణానికి పాల్పడ్డాడు. అసలు ఆ యువకుడు చేసిన దారుణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని స్థానికంగా ఉండే రామనాథపురంలోని తల్లిదండ్రులతో పాటు ఉంటున్న 27 ఏళ్ల స్వాతి అనే యువతి ఉన్నత చదువులు చదివి లైఫ్ లో స్థిరపడాలని కలలు కంటుంది. అలా పైస్థాయి చదువులు చదువున్న తరుణంలోనే స్థానికంగా ఉండే ఓ యువకడితో ప్రేమలో పడింది. ఒకరినొకరు నచ్చుకోవడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. అలా రోజులు గడుస్తూ వీరి ప్రేమ ప్రయాణం రెండేళ్లు గడిచింది. అయితే ఇటీవల కాలంలో స్వాతికి ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుని సంబంధాలు చూడడం మొదలు పెట్టారు.
మీరు ఈ క్రైమ్ వార్తలు చదివారా?
అలా వచ్చిన సంబంధాలను ఆ యువతి చెడగొడుతూ ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు. దీంతో పిన్ని కొడుకు వరుసకు తమ్ముడయ్యే శరవణన్ అక్కా ఇలా ప్రవర్తించడంతో అనేక సార్లు నచ్చజెప్పె ప్రయత్నం చేశాడు. ఆ యువతి అస్సలు తగ్గకుండా ప్రియుడినే పెళ్లాడుతానని చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన తమ్ముడు అక్క గొంతు కోసి పరారయ్యాడు. దీంతో స్వాతి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో నిందితుడు శరవణన్ పట్టుకుని అరెస్ట్ చేశారు. తాజాగా తమిళనాడులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. బలవంతపు పెళ్లిపై తమ్ముడు అక్కపై చేసిన ఇంతటి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.