తాడేపల్లిలోని కొందరు యువకులు మద్యం, గంజాయి సేవించి స్థానిక మహిళలను వేధిస్తూ నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా ఈ యువకులు చేసిన అల్లరికి భరించలేని కొందరు కుటుంబికులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక విషయం ఏంటంటే? తాడిపల్లిలోని నివాసం ఉంటున్న కొందరు యువకులు జాలీగా తిరుగుతూ నానా అల్లరి చేస్తున్నారు. స్థానికంగా ఉండే పీడబ్ల్యూడీ వర్క్ షాప్ వెనకాల ఇద్దరు ముగ్గురు యువకులు కలిసి గంజాయి సేవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కొందరు వారిని ప్రశ్నించగా చేపలు పట్టడానికి వెళ్తున్నామంటూ చెప్పి హల్చల్ చేస్తున్నారు. అలా చెప్పి ఎవరికి తెలియకుండా గంజాయి సేవిస్తున్నారు.
అయితే ఇటీవల ఓ రోజు అలా గంజాయి సేవించి అటుగా వెళ్తూ ఓ ఇంటికి వెళ్లారు. ఆంటీ.. ఈ ఒక్క రోజు రాత్రి మీ ఇంట్లో పడుకుంటామంటూ భయందోళనకు గురిచేశారు. దీంతో వెంటనే ఖంగుతిన్న మహిళ తన భర్తకు ఫోన్ చేసి యువకులు చేసిన హంగామా గురించి వివరించింది. దీంతో ఇంటికొచ్చి చూసే సరికి ఇంటి ముందు నానా హంగామా చేస్తున్నారు. ఇక స్థానికులు అంతా ఏకమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ చుట్టు పక్కల ప్రాంతాలపై కాస్త కన్నేసి ఉంచారు.