చాలా సందర్భాల్లో చెప్పుకున్నట్లుగానే ‘అనుమానం పెనుభూతం’. ఒక చిన్న అనుమానం మనిషి మనసులో నాటుకుంటే.. అది మహా వృక్షమవుతుంది. సంతోషం, సుఖం, ప్రశాంతంతను కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తుంది. అనుమానం అనే విష భీజం ఎన్నో కాపురాలను నాశనం చేసింది. అలాంటి అనుమానంతోనే ఓ భర్త చేసిన పని ఆ కుటుంబాన్నే కోలుకోలేని దెబ్బ కొట్టింది. భార్య వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆ భర్త చేసిన పనికి అతని కుమార్తెలు అనాథలుగా మారారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో కాటబోయిన కొండలు, అంజమ్మ దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం నుంచి వారి దాంపత్య జీవితంలో అనుకోని కలతలు, కలహాలు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయాన్ని కొండలు భూతద్దంలో పెట్టి చూడటం మొదలు పెట్టాడు. ఏ చిన్న తప్పు జరిగినా భార్యపై కేకలు వేయడం, కొట్టడం చేయసాగాడు. మొదట్లో ఎందుకు అలా చేస్తున్నాడు అనేది అర్థం అయ్యేది కాదు. కానీ, తర్వాత అతని మాటల్లో తెలిసిన విషయం ఏంటంటే.. కొండలుకి అంజమ్మపై అనుమానం మొదలైంది.
తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం కొండలు మనసులో నాటుకుంది. అప్పటివరకు సంతోషంగా సాగిపోతున్న కుటుంబాన్ని ఆ అనుమానం అతలాకుతలం చేసింది. రానురాను కొండలు ప్రవర్తన మరీ క్రూరంగా తయారైంది. భార్యతో గొడవ పడటమే కాదు.. ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. ఆమెను చిత్రహింసలకు గురిచేయసాగాడు. మంగళవారం ఆ హింసలు పరాకాష్టకు చేరాయి. కొండలు భార్య అంజమ్మను తీసుకుని పొలానికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో.. భార్యను పంటకాలవలో పడేసి ఆమె పీకపై కాలేసి తొక్కి హత్య చేశాడు. చుట్టుపక్కల ఉన్న వారు అంజమ్మ మృతదేహం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: తల్లిని పెళ్లాడి.. కుమార్తెతో రొమాన్స్
ఏ సమస్యకైనా.. దాడి, హత్య సరైన సమాధానం కాదు. ఒకరి ప్రాణాలు తీయడం, వారి ప్రాణాలు తీసుకోవడం నేరం. నిజంగానే అంజమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుకుందాం. అలాంటప్పుడు కొండలు చేయాల్సింది.. ఆమెను కొట్టడం, చంపడం కాదు. ఆ విషయాన్ని పెద్దలకు తెలియజేయాలి. నా భార్య నన్ను మోసం చేస్తోంది అని చెప్పాలి. వాళ్లు సరిగ్గా స్పందించకపోతే కోర్టుకు వెళ్లి సరైన ఆధారాలు చూపించి విడాకులు తీసుకుని ఎవరి జీవితం వాళ్లు గడపాలి. క్షణికావేశంలో కొండలు చేసిన పనికి శిక్ష ఇద్దరు ఆడ కూతుళ్లు అనుభవించాలి. తల్లి ప్రాణాలు పోయి.. తండ్రి కటకటాల పాలైతే వాళ్ల ఆలనాపాలనా ఎవరు చూసుకుంటారు. ఏ తోడు నీడ లేకుండా ఇద్దరు ఆడపిల్లలు ఈ సమాజంలో ఎలా బతకగలరు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.