కోపమే అన్ని అనర్థాలకు కారణం అని అందరికీ తెలుసు. కానీ, ఆ కోపాన్ని మాత్రం కంట్రోలు చేసుకోరు. ఒక్క చిన్నమాట అనగానే కోపంతో ఊగిపోతారు. అవలి వారిపై కేకలేస్తూ రెచ్చిపోతారు. ఆ కాసేపు వారు ఏం చేస్తున్నారు అనేది కూడా వారికి తెలీదు. అలా క్షణికావేశంలో ఓ భర్త తన భార్యను కొట్టాడు. ఆమె గోడకు తగిలి తలపగిలి చనిపోయింది. ఆ తర్వాత ఆమె హత్యను ఎలాగైనా ప్రమాదంగా చిత్రీకరించాలని భావించాడు. అందుకు ప్లాన్ వేసినా కూడా అదే ప్రణాళికతో దొరకిపోయాడు.
ఇదీ చదవండి: యువతిని బందీగా చేసుకున్న బాబా! తల్లిదండ్రుల ముందే..!
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులుతాండాలో జాతోబు స్వామి, మణెమ్మ(45) దంపతులు జీవిస్తున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. స్వామికి ఐదెకరాల పొలం ఉంది. అందులో వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల ట్రాక్టర్ కూడా కొన్నాడు. మణెమ్మ కూడా పొలంలో పనులు చేస్తుంటుంది. స్వామికి మణెమ్మ మూడో భార్య.. వేర్వేరు కారణాలతో మొదటి ఇద్దరు భార్యలను వదిలేశాడు. ప్రస్తుతం మణెమ్మతోనే ఉంటున్నాడు. స్వామికి రెండో భార్య కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ విషయంలో మణెమ్మకు గొంతు మింగుడు పడదు. వారితో ఎందుకు మాట్లాడతావు అంటూ గొడవ పడుతుంటుంది.
అదే విషయంలో నిత్యం వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. రెండో భార్య కుమార్తె స్వాతికి వివాహం చేశాడు. పెళ్లి సమయంలో రూ.5 లక్షల కట్నం ఇచ్చారు. స్వామి తన పేరు మీద ఉన్న ఐదు ఎకరాల్లో నుంచి కుమార్తెకు ఒక ఎకరం రాశాడు. ఆ విషయం కాస్తా మణెమ్మకు తెలిసింది. ఇంక ఉన్న గొడవలు చాలవన్నట్లు కొత్త గొడవ మొదలైంది. ఈ విషయాన్ని మూడో భార్య చాలా సీరియస్ గా తీసుకుంది. తన పరిస్థితి, తన కొడుకు పరిస్థితి ఏంటని నిలదీసింది. ఎలాగైనా తమకు న్యాయం చేయాలంటూ విషయాన్ని పెద్దల మనుషుల ముందు పెట్టింది. పంచాయితీలో పెద్దలు మణెమ్మ కుమారుడికి ఒక ఎకరం పొలం రాయాలని చెప్పారు.
ఇదీ చదవండి: చిన్నారిని ఎత్తుకెళ్ళి.. నరకం చూపించారు! వీళ్ళు మనుషులేనా?
పంచాయతీ పెద్దల మాటను జాతోబు స్వామి లెక్కచేయలేదు. మణెమ్మ కొడుకుకి పొలం రాసిచ్చేది లేదని తేల్చేశాడు. ఆ తర్వాత నుంచి మణెమ్మ ప్రతి విషయంలో స్వామితో గొడవలు పెట్టుకుంటోంది. బుధవారం రాత్రి కాలనీ వాసులు మొత్తం సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లారు. స్వామి పూటుగా తాగొచ్చాడు. ఆ సమయంలో మణెమ్మ మళ్లీ తన కుమారుడికి ఆస్తి రాయాలంటూ గొడవ పెట్టుకుంది. మద్యం మత్తులో ఉన్న స్వామి ఆమెను కొట్టాడు. గట్టిగా పక్కకు నెట్టేశాడు. మణెమ్మ ఒక్కసారిగా వెళ్లి గోడకు గుద్దుకుంది. ఆమె తలకు పెద్ద గాయమై అక్కడికక్కడే మరణించింది.
ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలని జాతోబు స్వామి భావించాడు. ఆమె మృతదేహాన్ని ట్రక్కులో పెట్టాడు. కాలనీవాసులు ఎవరూ లేరు కాబట్టి ట్రాక్టర్ తీసుకుని ఆ గ్రామంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మృతదేహాన్ని పడేసి ప్రమాదంలో మరణించింది అని తప్పుదోవ పట్టించాలని చూశాడు. అయితే ఆ ఆలోచనే అతడిని పట్టించింది. మణెమ్మ మృతదేహాన్ని అలా పడేసే సమయంలో స్థానికులు కొందరు గమనించారు. ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఘటనాస్థాలికి చేరుకున్న పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకున్నారు. మణెమ్మ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బెడ్ రూమ్ లో ప్రియుడు! పెరట్లో భర్త!