ప్రమాదం ఎక్కడ నుంచి పొంచి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వారు అకస్మాత్తుగా ఈ లోకం నుంచి దూరమైతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.
మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు కబలిస్తుంతో ఊహించడం చాలా కష్టం. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కానరాని లోకాలకు వెళ్తుంటారు. ఈ మద్య హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, నీటిలో మునిగి చనిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా సిద్దిపేటలో జిల్లా సామల్ పల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు
సిద్దిపేట జిల్లాలో గురువారం సాయంత్రం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ముగ్గురు చనిపోయారు. వర్గల్ మండలం సామలపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాద వశాత్తు చెరువులో మునిగి చనిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతులు హైదరాబాద్ కు చెందిన కాశీ, సోహెల్, ముస్తఫా గా గుర్తించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకొని చెరువు నుంచి మృతదేహాలను బయటకు వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం మార్చురీకి తరలించారు. ఈ విషయం గురించి తెలిసిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు.