తల్లి డ్వాక్రా గ్రూపు మీటింగ్ నుంచి రాత్రి లేటుగా వచ్చింది. కుమార్తె వేరే గదిలో నిద్రపోయి ఉంటుందని భావించింది. కానీ, ఆమె అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి. తెల్లవారిన తర్వాత వెళ్లి చూస్తే గదిలో కుమార్తె లేదు. ఎక్కడికి వెళ్లిందో అని కంగారుగా వెతుకుతున్న తల్లికి ఆమె మామిడి తోటలో శవంగా కనిపించింది. గొంతుకు చున్నీ బిగించి అతి కిరాతకంగా హత్య చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెళ్లిలో బుజ్జెమ్మకు సురేశ్, మౌనిక(16) ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త 15 ఏళ్ల కిందట చనిపోయాడు. కూలీనాలి చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తోంది. మౌనిక ఇంటర్ చదువుతోంది. ఆదివారం డ్వాక్రా గ్రూపు మీటింగ్ కు వెళ్లిన బుజ్జమ్మ రాత్రి 11.30 గంటలకు ఇంటికి వచ్చింది. ఆ సమయంలో కుమార్తె కనిపించలేదు. ఆమె వేరే గదిలో నిద్రపోయి ఉంటుందని భావిచింది. ఆమె కూడా నిద్రపోయింది. తెల్లవారిన తర్వాత గదిలో చూడగా మౌనిక కనిపించలేదు. ఆమె ఎక్కడికి వెళ్లిందో అని వెతకటం మొదలు పెట్టింది.
మధ్యాహ్నం సమయంలో గ్రామంలోని మామిడితోటలో మృతదేహం ఉందని తెలుసుకుంది. ఆందోళనతో అక్కడికి వెళ్లి చూడగా.. అది బుజ్జమ్మ కుమార్తె మౌనిక మృతదేహమే. కూతురుని అలా చూసి బుజ్జమ్మ నిర్ఘాంతపోయింది. మౌనిక మృతదేహంపై పడి బోరున ఏడ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థాలానికి చేరుకున్నారు. మౌనిక మెడకు చున్నీ బిగించి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బుజ్జమ్మ మాత్రం ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆమె ఫిర్యాదు మేరకు ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పిన్నితో ఎఫైర్ పెట్టుకున్నాడు..! ఆ రాత్రి పిన్ని కూడా..!