ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ బెట్టింగ్ లో ఎంతోమంది అప్ప చేసి మరీ డబ్బులు పెట్టుబడి పెట్టి.. చివరికి తాము మోసపోయామని తెలుసుకొని ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.
ఈ మద్య ఆన్ లైన్ బెట్టింగ్ లో దారుణంగా మోసపోయి.. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం డబ్బు ఆశ చూపించి ఆన్ లైన్ మోసాలకు పాల్పపడుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవొచ్చన్న ఆశతో చాలా మంది దారుణంగా మోసపోతున్నారు. తాజాగా సంగారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది.
సంగారెడ్డి లో విషాదం చోటు చేసుకుంది. డబ్బు ఆశతో ఆన్ లైన్ లో రూ. 12 లక్షలు పెట్టుబడి పెట్టిన అరవింద్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తాను మోసపోయినట్టు తెలుసుకొని మనస్థాపాంతో ఆత్మహత్య చేసుకున్నాడు. టెలిగ్రామ్ లో వచ్చిన లింక్ ఓపెన్ చేసిన అరవింద్.. కొన్ని టాస్క్ లకు రూ. 200 పెట్టుబడి పెడితే.. రూ.250 పంపారు. దాంతో అధికంగా డబ్బు వస్తుందన్న ఆశతో రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టాడు అరవింద్. ఆన్ లైన్ లో టాస్క్ లు పూర్తి చేసినా స్పందించని కేటుగాళ్ళు. వచ్చే నెల 5న అరవింద్ సోదరి వివాహం. తన సోదరి పెళ్లి కోసం దాచిన డబ్బులు ఖర్చు చేసి ఆ డబ్బు సర్ధుబాటు చేయలేని పరిస్థితిలో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.