ప్రతి ప్రేమ కథకు హ్యాపీ ఎండింగ్ ఉండదు అంటారు. అవును ఇతని కథ వింటే అది నిజమని నమ్మక తప్పదు. ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. ఎంతగా అంటే.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత. ఎంతగా అంటే వారు కలిసుండటం కోసం.. రక్త సంబంధాలనే వద్దనుకునేంత. ఎంతగా అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు తీసుకునేంత. ఎంతగా అంటే వచ్చే జన్మలో అయినా కలిసి బతుకుతామేమో అనే ఆశతో ఈ జీవితాన్ని వదులుకునేంతగా. ఎంతో ఆశగా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కానీ, వారు అనుకున్నట్లు ఏదీ జరగలేదు. పెళ్లి అయ్యాక కూడా వారికి వేధింపులు తప్పలేదు. భర్తకు దూరంగా ఉండలేక ఆ యువతి ప్రాణం తీసుకుంది. ప్రేమించిన భార్య దూరం కావడంతో.. ప్రేమికుల రోజున ఆ యువకుడు కూడా ఉసురు తీసుకున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి గ్రామానికి చెందిన తేళ్ల భానుచందర్(24) కన్నీటి కథ ఇది. భానుచందర్ ఓ డ్యాన్సర్. ఎలాగైనా టీవీ షోలో పార్టిసిపేట్ చేయాలని కలలు కంటూ ఉండేవాడు. బతుకుతెరువు కోసం చిన్న చిన్న షోలు చేస్తుంటాడు. అతనికంటే రెండేళ్లు పెద్దదైన తన మేనమామ కూతిర్ని ప్రేమించాడు. ఆమెకు కూడా భానుచందర్ అంటే ఎంతో ఇష్టం. వారి ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేశారు. భానుచందర్ తో వివాహానికి స్వర్ణలత తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఎలాగైనా వారు పెళ్లి చేసుకుని ఒకటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. గతేడాది మార్చి 10న గుడిలో భానుంచదర్- స్వర్ణలత వివాహం చేసుకున్నారు.
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆస్తిపాస్తులు లేకున్నా ఒకరి కోసం ఒకరు ఉన్నామని ఆనందపడ్డారు. వారి ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదు. భానుచందర్ కు ఆస్తిపాస్తులు లేవు, సొంత భూమిలేదనే వంకతో స్వర్ణలతను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. వారిద్దరినీ కలవనివ్వకుండా పెద్దలు అడ్డుపడ్డారు. స్వర్ణలతను హైదరాబాద్ సనత్ నగర్ లోని సోదరి ఇంట్లో ఉంచారు. భానుచందర్ తో ఫోన్ లో మాట్లాడటమే ఆమెకు కష్టంగా ఉండేది. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నా పెద్దల వల్ల విడిగా ఉండాల్సి వస్తోందని స్వర్ణలత మనస్తాపానికి గురైంది. ఎప్పటికైనా భానుచందర్ ను కలుస్తాననే ఆశ ఆమెలో చచ్చిపోయింది. జీవితంపై విరక్తితో జనవరి 5న స్వర్ణలత ఆత్మహత్యకు పాల్పడింది.
ఇదీ చదవండి: మంచం పట్టిన 87 ఏళ్ల ముసలమ్మపై కామవాంఛ! వీడు మనిషేనా?
స్వర్ణలత మరణానికి భానుచందర్ కారణమంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద భానుచందర్ పై కేసు నమోదైంది. అతడిని జనవరి 24న సంగారెడ్డి జిల్లా కారాగారానికి రిమాండ్ ఖైదీగా తరలించారు. ప్రేమించి పెళ్లాడిన యువతి ఆత్మహత్య చేసుకోవడం.. ఆ కేసులో తాను రిమాండ్ ఖైదీగా జైలులో ఉడటం.. ఈ విషయాలు భానుచందర్ ను నిత్యం వెంటాడుతుండేవి. తన భార్యలేని జీవితం ఇంకెందుకని భావించాడో? తనకంటూ ఎవరూ లేరనే నిర్ణయానికి వచ్చాడో? ప్రేమికుల దినోత్సవం రోజున ఉదయం 6 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు బాత్ రూమ్ లోని వెంటిలేటర్ కు దుప్పటితో ఉరివేసుకుని ఉసురుతీసుకున్నాడు.
భానుచందర్ ఆత్మహత్య తర్వాత ఓ 14 పేజీల లేఖ లభించింది. అందులో తన ప్రేమ, పెళ్లి, బాధ, అన్నింటిని ప్రస్తావించాడు. ‘నా భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నాతో వీడియోకాల్ మాట్లాడింది. ఇద్దరం కలిసి ఉండాలని కోరుకుంది. ఆమె కోరిక తీరలేదు. పరోక్షంగానైనా నా భార్య చావుకు నేను కారణం అయ్యాననే భావన నన్ను అనుక్షణం వేధిస్తోంది. నాకు భూమి, ఆస్తి లేదని నా భార్య కుటుంబీకులు అనే మాటలు వింటే నరకంలా అనిపించేది. నా చావుకు ఎవరూ కారణం కాదు. పిల్లల్ని కనేది చంపుకోవడానికి కాదని పెద్దలు గుర్తించాలి. ఎక్కడున్నా పిల్లలు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకోవాలి. ప్రేమలేని లోకంలో నేను జీవించలేను’ అంటూ భానుచందర్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: పిన్నితో ఎఫైర్ పెట్టుకున్నాడు..! ఆ రాత్రి పిన్ని కూడా..!
భానుచందర్ ఆత్మహత్యకు భార్య తరఫు వాళ్లే కారణం అంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సంగారెడ్డి రూరల్ పోలీసుస్టేషన్ లో మరో కేసు నమోదైంది. భానుచందర్- స్వర్ణలతవి పేరుకి ఆత్మహత్యలు అయినా.. నిజానికి పేరుప్రఖ్యాతలు, ఆస్తి, అంతస్థు వంటి అంతరాలు చేసిన అతి కిరాతకమైన హత్యలు అవి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.