ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు. ఆ సమయంలో క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తనువు చాలిస్తున్నారు. దాంతో ఎన్నో కుటుంబాల్లో పెద్ద దిక్కు కోల్పోయి పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు.
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు. ఆ సమయంలో క్షణికావేశానికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా తీసుకునే నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నింపుతున్నాయి. ఎంతోమంది తమ కుటుంబ పెద్దలను కోల్పోయి అనాథలుగా మిగులుతున్నారు. భార్యతో చిన్న గొడవ కారణంగా భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.. తన వల్లే భర్త ఆత్మహత్యకు యత్నించాడని బాధతో భార్య ఉరివేసుకొని చనిపోయింది.. తన కూతురు ఆత్మహత్యకు పాల్పపడిందని ఆవేదనతో తల్లి సంపులో దూకి తనువు చాలించింది. ఈ విషాద ఘటనలు రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లీ కూతుళ్ళ ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైతాబాద్ గ్రామానికి చెందిన మల్లేశ్, యాదమ్మలకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కొంతకాలం క్రితం మల్లేశ్ చనిపోయాడు. అప్పటి నుంచి యాదమ్మ కూతురు, కొడుకును ఎన్నో కష్టాలు పడి సాకింది. రెండు సంవత్సరాల క్రితం కూతురు సుమిత్రకు రుద్రారం గ్రామానికి చెందిన శివకుమార్ తో వివాహం అయ్యింది. ఈ మద్య కూతురు, అల్లుడికి మద్య చిన్న చిన్న వివాదాలు రావడం.. యాదమ్మ వెళ్లి సర్ధి చెప్పడం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే సుమిత్రతో గొడవపడిన శివకుమార్ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి బతికించారు.
తన భర్త శివకుమార్ తన కారణంగానే మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని పశ్చాత్తాపంతో సుమిత్ర మంగళవారం రాత్రి తల్లిగారింట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పిల్లాపాపలతో ఎంతో ఆనందంగా ఉండాల్సిన తన కూతురు హఠాత్తుగా చనిపోవడంతో జీర్ణించుకోలేకపోయింది తల్లి యాదమ్మ. తన కూతురు జీవితం ఇలా అయ్యిందే అన్న ఆవేదనతో ఇంటిముందు ఉన్న సంపులో దూకి బలవన్మరణానికి పాల్పపడింది. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే తల్లి కూతురు చనిపోవడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో ఎంతో కలివిడిగా ఉండే తల్లి కూతురు చనిపోవడంతో గ్రామస్థులు కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.