ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం.. చిరాకు పడటం లాంటివి చేస్తున్నారు. కొంతమంది మానసిక ఒత్తిడి వల్ల క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ మద్య చాలామంది చిన్న చిన్న విషయాలకే మనసు వికలం చేసుకొని క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. చాలా వరకు ప్రేమ వ్యవహారాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి వల్ల తీవ్రమైన మనోవేదనకు గురై క్షణాల్లో దారుణమైన నిర్ణయాలు తీసుకొని జీవితాలను కోల్పోతున్నారు. తమకు ఇష్టమైన వారిని కోల్పోయి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. పీజీ చదువుతున్న విద్యార్థిని బలవన్మరణం చేసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూరు టౌన్షిప్ లో నివసిస్తున్న శ్రీనివాస్ రాజు కూతురు తేజస్వి(25) పీజీ చదువుతుంది. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం అన్నవరం సత్యనారాయణ స్వామి ని దర్శించుకొని నిన్న మధ్యహ్నాం ఇంటికి చేరుకున్నారు. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్న తేజస్వి ఫ్రెషప్ అయి తన గదిలోకి వెళ్లిపోయింది. ఎంతసేపటికీ గది నుంచి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి తేజస్వి గది తలుపు కొట్టారు.. కానీ అవతల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తలుపు బద్దలు కొట్టి గదిలోకి వెళ్లారు. లోపల తేజస్వి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
చదువులో ఎప్పుడూ చలాకీగా ఉండే.. తేజస్వి ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న మణిపాల్ యూనివర్సిటీలో సైకాలజిస్ట్ కోర్సు చేస్తుంది. అయితే తేజస్వికి సైకాలజీ చేయడం ఇష్టం లేదని గతంలో పలు మార్లు తమతో చెప్పిందని.. బహుషా తనకు చదువు ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పపడి ఉంటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేజస్వి మృతికి సంబంధించిన వివరాలు సేకరించి బీడీఎల్ భానురు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.