హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయి నిద్రిస్తున్న భార్యను చంపి తలతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫర్వేజ్, సమ్రీన్ బేగం అనే ఇద్దరు భార్యాభర్తలు. వీరు స్థానిక ఇమాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అయితే గతంలో ఫర్వేజ్ తన భార్యపై అనేక వేధింపులకు గురి చేయడంతో కొంతకాలం వీరి మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో భరించలేని భార్య భర్తతో విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక కొన్ని రోజులకు భర్త మళ్లీ కొత్త రాగం ఎత్తుకుని మాయమాటలు చెప్పి నమ్మించి మళ్లీ రెండోసారి వివాహం చేసుకున్నాడు. మారాడు కాదా అని అనుకున్నభార్య సమ్రీన్ బేగం అతనితో పాటు మళ్లీ సంసారాన్ని ప్రారంభించింది. అయితే రోజులు గడిచే కొద్ది భర్త ప్రవర్తన మళ్లీ మొదటికి వచ్చింది. రోజు మద్యం తాగడం, ఎవరితోనైన మాట్లాడితే అక్రమ సంబంధం అంటకట్టడం చేస్తూండేవాడు.
అయితే గురువారం రాత్రి గంజాయి సేవించి భర్త ఫర్వేజ్ ఇంటికొచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఇక అదే రోజు రాత్రి 4 గంటల సమయంలో భార్య నిద్రపోతుండగా ఫర్వేజ్ క్షణికావేశంతో భార్యను నరికి తలతో పోలీస్టేషన్ కు వెళ్లాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఫర్వేజ్ అరెస్ట్ చేసి భార్య శవాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భర్త ఫర్వేజ్ క్షణికావేశంలో భార్యను చంపి ఆనాధలైన పిల్లలు ఘటనలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.