దేశంలో కామాంధుల అరాచకాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఎన్ని రకాలుగా శిక్షిస్తున్నా అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అత్యంత కిరాతకమైన ఘటన రాజస్థాన్ లో జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ వివాహితను అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అది కూడా పోలీసులు పోస్టుకు కూత వేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఒంటిపై చీర కూడా లేకుండా పోలీసుస్టేషన్ కు పరుగులు పెట్టి తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు మొరపెట్టుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లా ఝాఢోల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం పెహర్ లోని తన అత్తగారింటికి వెళ్లేందుకు బాధిత మహిళ సాయంత్రం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. బైక్ వచ్చిన దుండగులు మహిళను అడ్డుకున్నారు. ఆమెను బలవంతంగా రోడ్డు పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోకి లాక్కెళ్లి ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాఘ్పూరా చౌక్ కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది.
ఘటన తర్వాత ఒంటిపై చీర కూడా లేకుండా బాధితురాలు పోలీసుస్టేషన్ కు పరుగులు పెట్టింది. ఆమెపై జరిగిన అమానుష ఘటన గురించి వివరించింది. సమాచారం అందిన వెంటనే ఉదయ్ పూర్ ఎస్పీ మనోజ్ చౌదరి, ఝాఢోల్ పోలీసు సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. వారికి ఘటనాస్థలంలో మహిళ చీర, ఓ వ్యక్తి ఉంగరం దొరికాయి. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు యువకులపై అత్యాచారం కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.