ఈ మధ్యకాలంతో అమ్మాయిలపై హత్యలు, అత్యాచారాలు చెలరేగిపోతున్నాయి. యువతి ప్రేమకు నిరాకరించిందని కొందరు కేటుగాళ్లు అత్యాచారం చేయటం, ఆపై హత్య చేయటం మనం ఇప్పటి వరకు చాలనే చూశాం. కానీ రాజస్థాన్ లో మాత్రం తన సొంత కూతురిపై ఓ కసాయి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
పోలీసులు తెలిపన వివరాలను పరిశీలిస్తే.. సిరోహి జిల్లాలో ఓ వ్యక్తి భార్యాపిల్లలతో పాటు నివాసం ఉండేవాడు. అయితే ఇటీవల కాలంలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో భాగంగా జోధ్‌పూర్ ఓపెన్ జైల్లో అతడు జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే రాజస్థాన్ ప్రిజనర్స్ ఓపెన్ ఎయిర్ క్యాంపస్ రూల్స్ 1975 ప్రకారం భర్త ఏదైన నేరం చేసి జైళ్లో ఉంటే భర్తతో పాటు కుటుంబం కూడా అతనితో ఓపెన్ జైళ్లో ఉండే వెసులుబాటు ఉంది. అలా అతని భార్యతో పాటు కూతురు కూడా అదే ఒపెన్ జైళ్లో కొన్ని రోజుల నుంచి ఉంటున్నారు. ఇక కొంత కాలం తర్వాత భర్త ప్రవర్తన తీరు నచ్చక భార్య జైలు నుంచి వచ్చి తన పుట్టింటికి వెళ్లింది. ఇక తన కూతురు మాత్రం తండ్రి వద్దే కొన్ని రోజులు ఉంది. ఈ క్రమంలోనే తండ్రి కమాంధుడిగా మారతాడని ఆ కూతురు ఊహించలేదు.
ఈ నేపథ్యంలోనే ఆ కసాయి తండ్రి ఒంటరిగా ఉన్న తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జైళ్లోనే ఉంటూ పోలీసుల ముందే తన కన్న కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టి అదే జైళ్లో నుంచి పారిపోయాడు. ఇక ఇదే విషయాన్ని ఆ బాలిక తన తల్లికి కన్నీటితో వివరించి చెప్పడంతో తల్లి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇక స్థానిక పోలీసులను ఆశ్రయించి భర్తపై తీరును వివరించింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. తండ్రి అయి ఉండి తన కన్నకూతురిపైనే ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఘటన ఇటీవల స్థానికంగా సంచలనంగా మారింది. ఇక ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఓ తండ్రి దుర్మార్గంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.