సమాజంలో ఆడవాళ్లు, యువతులు, బాలికలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం చాలా కష్టం అని అందరికీ తెలుసు. తాజాగా కామాంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు నాలుగేళ్ల చిన్నారిపై తన పైశాచిక కోరిక తీర్చుకున్నాడు. భరించలేని నొప్పితో ఆ చిన్నారి కేకలు వేయడంతో ఏమైందోనని తండ్రి పరుగున వెళ్లాడు. రక్తపు మడుగులో ఉన్న కన్నకూతుర్ని చూసి నిర్ఘాంత పోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి.. ఆ కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం జలోర్ లోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాధితురాలి ఇంటికి తమ బంధువులు వచ్చారు. అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. అందరూ కలిసి కూర్చొని భోజనం చేశారు. ఆ తర్వాత చిన్నారి తండ్రి బయటకు వచ్చాడు. కాసేపటికి తన కుమార్తె కేకలు, ఏడుపు వినిపించి ఇంట్లోకి పరుగులు పెట్టాడు. అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంత పోయాడు. పాప నెత్తురు మడుగులో ఏడుస్తూ ఉంది. అటుగా తమ బంధువైన యువకుడు మేఘావాల పరుగులు పెడుతూ కనిపించాడు.
ఆ చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు జరిగిన విషయాన్ని సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీలులు బాధితుడి ఇంటి వెనుక పొలాల్లో దాక్కున్న నిందితుడిని పట్టుకున్నారు. కేవలం రెండు గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన మేఘావాలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి పరిస్థితి చూసి ఆమెను మెరుగైన వైద్యం కోసం జోధ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జలోర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాలా స్పందించారు. ‘పాప పరిస్థితి చూసి సమయం వృథా చేయకూడని ఆమెను వెంటనే జోధ్‌పూర్ తరలించాం. ఆమెకు అక్కడ మెరుగైన వైద్యం అందింది. పాప పరిస్థితి నిలకడగా ఉంది’ అని జోలర్ ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తరగతి గదిలో దారుణం..బాలిక కేకలు! వెళ్లి చూస్తే..!