కొందిరికి ఇంట్లో ఇల్లాలు ఉన్నా.. ఒళ్లో ప్రియురాలు ఉండాల్సిందే. అలా కక్కుర్తి పడుతూ భార్యలకు రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయిన భర్తలు ఎంతో మంది ఉన్నారు. కొందరైతే పెళ్లాం చేతిలో చావు దెబ్బలు తిన్నాక బుద్ధి తెచ్చుకున్నారు. పచ్చని సంసారం కంటే చీకటి సుఖాలే ముఖ్యం అనుకున్న గుజరాత్ కు చెందిన వ్యాపారి.. పెళ్లాం చేతిలో చావు దెబ్బలు తినలేదులెండి. కానీ, ఆ పరిస్థితి వస్తుందని గ్రహించి ప్రేయసితో కలిసి జెండా ఎత్తేశాడు. ఎంతో జాగ్రత్తగా మేనేజ్ చేసినా ఎలా దొరికిపోయానా? అని అతని మనసులో ప్రశ్న ఇంకా మెదులుతూనే ఉంటుంది. ఆవిడ స్కెచ్ ఆ రేంజ్ లో వేసి వాళ్ల బాగోతాన్ని బయటపెట్టింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
పుణే పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త కథ ఇది. అతని భార్య కూడా అదే కంపెనీకి డైరెక్టర్ గా ఉంది. 41 ఏళ్ల యవ్వనంలో ఆ వ్యాపారవేత్త ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు బాగానే మేనేజ్ చేశాడు. కానీ, భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం మొదలైంది. తనకు తెలియకుండా ఏదో తప్పు చేస్తున్నాడని భావించింది. భర్త కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. ఓ రోజు బిజినెస్ పనిమీద బెంగళూరు వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. కానీ, అతని జీపీఎస్ లొకేషన్ మాత్రం పుణేలో ఉన్నట్లు చూపించింది.
ఆ దెబ్బతో భర్తపై ఆమె అనుమానం మరింత బలపడింది. భర్త బస చేసిన హోటల్ సిబ్బంది దగ్గర అన్ని విషయాలు ఆరా తీసింది. అక్కడి సీసీటీవీ దృశ్యాలు పరిశీలించింది. ఆమె అనుమానం నిజమని నిర్ధారణ జరిగింది. రిసెప్షన్ లో ఆ యువతి తన భార్య అంటూ సొంత భార్య ఆధార్ కార్డు చూపించి రూమ్ బుక్ చేసుకున్నాడు. ఈ విషయంపై వ్యాపారవేత్త భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరి ఆధార్ కార్డు చూపిస్తున్నారో కూడా చెక్ చేయరా? అంటూ నిప్పులు చెరిగింది.
ఇదీ చదవండి: కూతురి కేకలు విని పరుగున వెళ్లిన తండ్రి. రక్తపు మడుగులో..!
అక్కడితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 419 కింద కేసు నమోదు చేశారు. అయితే భార్యకు తెలిసిపోయిందని గ్రహించిన సదరు వ్యాపారవేత్త ప్రేయసితో అప్పటికే జెండా ఎత్తేశాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్త అతితెలివి చర్యలకు భార్య టెక్నాలజీతో భలే చెక్ పెట్టింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.