మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు కొంత కాలం సంతోషంగా జీవిస్తున్నారు. ఇలా కొంత కాలం సాగించిన భార్యాభర్తలు వైవాహిక సంసారంలో అలుమొగలు వివాహేతర సంబంధానికి అలవాటు పడి ఒకరికి తెలియకుండా మరొకరు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా చీకటి సంసారానికి బానిసలై కొందరు మహిళలు హత్యలు లేదా ఆత్మ హత్యలకు గురవుతున్నారు. ఏపీలో అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ నిండు ప్రాణం గలిలో కలిసిపోయింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… ప్రకాశం జిల్లాలోని ఒంగోలు టూ టౌన్ లో శాంతి అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే ఆ మహిళ కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఇలా అప్పుడప్పుడు ప్రియుడిని కలుస్తున్న సమయంలోనే అతని కుమారుడిపై మోజు పడింది. వరసకు కుమారుడు అయ్యే ఆ యువకుడు కూడా మహిళకు సై అన్నాడు. ఇంకేముంది.. సమయం దొరికినప్పుడల్లా ప్రియుడిని కాదని అతని కుమారుడితో చీకటి సంసారానికి పచ్చ జెండా ఊపి విచ్చలవిడిగా రొమాన్స్ కు తెర లేపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే ఈ ఒకానొక సమయంలో ఆ యువకుడికి శాంతి రూ.50 వేలు ఇచ్చి బైక్ కొనుక్కోమని చెప్పింది. ఇక కొన్ని రోజులు గడిచాక ఆ యువకుడిని మహిళ డబ్బులు అడిగిందట. ఇలా ఆ యువకుడు ఆమెను డబ్బులు అడిగిన కారణంగానే ఇద్దరి మధ్య కాస్త వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అడిగిన డబ్బులు ఇవ్వమన్నందుకు ఆ యువకుడు ఆ మహిళను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.