‘నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు’ అంటూ మగధీరలో రణధేవ్ బిల్లా మిత్రను హత్య చేస్తే అందరూ తిట్టుకున్నారు. అది కేవలం సినిమాలో భాగమనే తెలుసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, నిజజీవితంలో ఓ పారిశ్రామిక వేత్త కుమారుడు తనతో వివాహానికి అంగీకరించలేదని ఓ యువతిని అపహరించి అత్యాచారం చేసి అత్యంత దారుణంగా ఆమె తల నరికి హత్య చేశాడు. ఆ ఘటన తీవ్ర కలకలం రేపింది. అతడిని ఉరి తీయాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఆ కేసులో కోర్టు అతనికి మరణశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జకీర్ జాఫర్ కుమారుడు జహిర్(30).. నూర్ ముఖధామ్(27) అనే యువతి చిన్నప్పటి నుంచి స్నేహితులు. కలిసే పెరిగారు, కలిసే తిరుగుతుండేవారు. నూర్ ముఖధామ్ ను ప్రేమించాడు. ఆ విషయం ఆమెకు చెప్పడంతో నిరాకరించింది. అతనిపై ఆ ఉద్దేశం లేదంటూ తేల్చి చెప్పింది. తన ప్రేమను నిరాకరించిందని కక్ష పెంచుకున్నాడు. ఓ రోజు ఆమెను అపహరించి రెండ్రోజుల పాటు నరకయాతన పెట్టాడు. ఆమెను అత్యాచారం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతి కిరాతకంగా ఆమె తల నరికి హత్య చేశాడు.
తన కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టగా రెండ్రోజుల తర్వాత తల, మొండం వేరుగా నూర్ మృతదేహం జాహిర్ ఇంట్లో లభించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వార్త పాకిస్తాన్ లో తీవ్ర కలకలం రేపింది. అందరూ ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యుడిని అరెస్టు చేసి ఉరితీయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. వ్యతిరేకత ఎక్కువ కావడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జహిర్ ను అప్పుడే అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: లాడ్జిలో లింగమార్పిడి ఆపరేషన్.. మర్మాంగాన్ని తొలగించి!
గురువారం ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు ఈ కేసులో జహిర్ ను పాకిస్తానీ శిక్షాస్మృతి సెక్షన్ 302 ప్రకారం దోషిగా తేల్చింది. అతడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై స్థానికంగా ఎంతో మంది ఆనందం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తికి కోర్టు సరైన శిక్ష విధించింది అంటూ సంబరాలు చేసుకున్నారు. ఇంకోసారి ఎవరికైనా అలాంటి ఆలోచనలు వస్తే ఉరితీస్తారనే భయం వస్తుందని ఆకాంక్షిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.