కొందరు దుర్మార్గులు కోరిక తీర్చుకునేందుకు ఎంతటి దారుణానికైనా ఒడుగడుతున్నారు. వారి కన్ను పడితో అవతలి వాళ్లు ఎవరైనా కానివ్వండి వెనుకాడటం లేదు. తెలిసినవారైనా.. అలా చేస్తే దొరికిపోతామని తెలిసినా కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ అమానవీయ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. భార్య స్నేహితురాలిపై ఆ భర్త కన్నేశాడు. ఆమెతో శారీరక సుఖం తీర్చుకోవాలని భావించాడు. అందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. ఆమెపై దాడి చేశాడు. ఆమె ప్రాణాలు కోల్పోయింది. తన కోరిక తీర్చుకునేందుకు శవాన్ని కూడా వదలలేదు. ఆమె ప్రాణం పోయిందని తెలిసినా కూడా అతడి వాంఛ తీర్చుకున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. నార్త్ ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సరళ(పేరు మార్చాం)కు చిన్ననాటి స్నేహితురాలు ఉంది. వారిద్దరిదీ ఎంతో మంచి స్నేహం. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. వివాహం తర్వాత కూడా తరచూ కలుస్తూనే ఉండేవారు. సరళ భర్త కూడా ఆమెతో మంచిగా కలిసిపోయేవాడు. క్లోజ్ ఫ్రెండ్ భర్త కావడంతో సరళ ఫ్రెండ్ కాస్త చనువుగానే ఉండేది. అయితే అతని బుర్రలో మరో ఆలోచన ఉందని ఎవరికీ తెలీదు. భార్య ఫ్రెండ్ పై ఆ నీచుడి కన్ను పడిందని తెలుసుకునేలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
సరళ భర్త ఉద్యోగం లేకుండా రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. సరళ మాత్రం కమలానగర్ లో ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఫిబ్రవరి 19న భార్య దుకాణం నుంచి వచ్చే సరికి తన ఫ్రెండ్ ఇంట్లో అర్ధనగ్నంగా పడి ఉంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆమె అత్యాచారం చేసి, హత్యకు గురైందని ఘటనాస్థలాన్ని చూడగానే పోలీసులకు అర్థమైంది. సరళ భర్త కనిపించకపోవడం కూడా పోలీసులు అనుమానానికి బలం చేకూర్చింది. వెంటనే సరళ భర్త కోసం గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి: కొడుకు భార్యపై మామ కన్ను! ఏకంగా పెళ్లి చేసుకోమంటూ!
మొదట మృతురాలి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. ‘ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో సరళ భర్త నా కుమార్తెకు ఫోన్ చేశాడు. మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. వాలెంటైన్స్ డేకి తన భార్యకు ఏం కొనివ్వలేదని. అందుకని తనకోసం ఓ చీర కొనాలని చూస్తున్నానని చెప్పాడు. అందుకు నా కుమార్తెను సహాయం చేయాలని కోరగా ఆమె అందుకు అంగీకరించింది. సాయంత్రం 4 గంటల సమయంలో వచ్చి బైక్ పై ఎక్కించుకెళ్లాడు. ఆ తర్వాత 5 గంటల సమయంలో నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరళకు కూడా కాల్ చేశాం. ఆమె ఫోన్ కూడా కలవలేదు. మాకు ఆందోళన కలిగింది. కానీ, ఆ తర్వాత నా కుమార్తెకు జరిగిన ఘోరం మాకు తెలిసింది’ అంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరు అయ్యింది.
సరళ భర్తపై పోలీసులకు ఉన్న అనుమానం నిజమైంది. అతడి కోసం గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆ దుర్మార్గానికి పాల్పడింది తానేనని సరళ భర్త ఒప్పుకున్నాడు. దర్యాప్తులో ఇంకో షాకింగ్ విషయం తెలిసింది. ఏంటంటే.. ఆమెను తన కోర్కె తీర్చమని కోరగా అందుకు ఆమె నిరాకరించింది. బలత్కారం చేసేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించింది. అందుకని ఆమెపై దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె మరణించింది. తను చనిపోయింది అని తెలిసి కూడా వాడు తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
ఇదీ చదవండి: భర్తతో పనేంటి.. ప్రియుడు ఉండగా? బరి తెగించిన భార్య!
ఈ విషయాలన్నీ తెలిసి సరళ కూడా ఎంతో భయపడింది. తన ప్రాణ స్నేహితురాలి ప్రాణం తీసింది భర్తే అని తెలిసి విలపించింది. ఇంకో బాధాకర విషయం ఏంటంటే.. ‘మే 3న నా సోదరికి వివాహం నిశ్చయమైంది. ఆమె పెళ్లి కోసం మా అమ్మ నగలు కూడా కొనిపెట్టింది. అవి వేసుకుని మా అక్క ఫొటోలు కూడా దిగింది. మాకు ఇప్పుడు ఆ ఫొటోలు మాత్రమే మిగిలాయి. మా అక్క మాకు కాకుండా పోయింది. ఓ కామ పిశాచి కోరికకు నా సోదరి బలైపోయింది’ అంటూ మృతురాలి సోదరి కన్నీరు మున్నీరు అయ్యింది. అతడిని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.