నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గత కొంత కాలంగా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నాడని శ్రీనివాస్ ఆరోపించాడు.
గత కొంత కాలంగా ఆయన దోపీడి దారుణంగా కొనసాగుతుందని.. ఎవరైనా గ్రామాంలో అత్యవసరంగా డబ్బు అవసరమై అప్పుకోసం ఆయన వద్దకు వెళ్తే .. వారి అవసరాలు ఆసరా చేసుకొని ది శాతం ఎక్కువగా వడ్డీ వసూలు చేస్తూ వేధిస్తున్నాడని తెలిపారు. శ్రీనివాస్.. కలెక్టర్ నారాయణ రెడ్డి కారుకు అడ్డుగా నిలబడి నిరసనకు దిగడంతో స్వయంగా కలెక్టర్ శ్రీనివాస్ సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ కి కలెక్టర్ హామీ ఇచ్చాడు.
ఇది చదవండి: సరిహద్దుల్లో కలకలం.. చెట్టుకు వేలాడుతూ ముగ్గురు యువతుల డెడ్‌బాడీలు!