పల్లెల నుంచి కోటి ఆశలు, కొండత బాధ్యతలతో వచ్చారు. ఉపాధి దొరికింది.. జీవితం సాఫీగా సాగిపోతోంది. ఒకే రంగంలో ఉన్న యువకుడితో ఆ యువతి ప్రేమలో పడింది. కొన్నాళ్ల తర్వాత మరో యువకుడు పరిచయం అయ్యాడు. అతని పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. మొదట పరిచయం అయిన వ్యక్తిపై ఆ యువతికి సదాభిప్రాయం లేక దూరం పెట్ట సాగింది. రెండో యువకుడు వచ్చిన తర్వాతే వారి మధ్య దూరం పెరిగిందని భావించిన అతను కత్తితో అతి కిరాతకంగా పొడిచి హత్య చేశాడు.
ఇదీ చదవండి: మరిదిపై కన్నేసిన వదిన.. పడక సుఖం కోసం పగ పట్టి..!
వివరాల్లోకి వెళితే.. ఈ హత్య ఘటన మంగళవారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. రమేశ్(కథనంలో అందరి పేర్లు మార్చడం జరిగింది.) అనే యువకుడు నిర్మల్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు. మరో యువకుడు హరీశ్ వేరే ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. అక్కడే పనిచేసే యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకోవడం, కలుసుకోవడం చేసేవాళ్లు. కొన్నాళ్లకు వారి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లకు ఆ యువతికి హరీశ్ తో పరిచయం ఏర్పడింది. అదేంటో ఆ పరిచయం కూడా ప్రేమగానే మారింది. ఆ యువతి రమేశ్ ను దూరం పెడుతూ వచ్చింది.
హరీశ్ తోనే కలుస్తుడంటం చేస్తోంది. ఆ విషయం తెలుసుకున్న రమేశ్.. హరీశ్ పై పగ పెంచుకున్నాడు. హరీశ్ వచ్చాకే వారి మధ్య దూరం పెరిగిందని భావించాడు. ఎలాగైనా హరీశ్ అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. వారం క్రితమే ఓ కత్తి కొనుక్కుని పెట్టుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఓరోజు ఆ యువతిని కలిసేందుకు ఆమె ఉండే గదికి వెళ్లాడు. ఆక్కడ ఆమె లేకపోవడంతో మాట్లాడాలి అని పిలిచాడు. హరీశ్ కు ఎందుకో అనుమానం వచ్చి యువతితో పాటు అతను కూడా వెళ్లాడు. అప్పటికే అక్కడ కత్తితో సిద్ధంగా ఉన్న రమేశ్.. హరీశ్ పై దాడికి దిగాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. కాసేపటికి తన దగ్గరున్న కత్తితో హరీశ్ ను గుండె భాగంలో పొడిచాడు. హరీశ్ కుప్పకూలాడు. రమేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి వెంటనే మిత్రులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చేసరికి రక్తపు మడుగులో హరీశ్ కొట్టుమిట్టాడుతున్నాడు. అందరూ కలిసి హరీశ్ ను ఓ ప్రేవేట్ ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి హరీశ్ మరణించాడు. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. రమేశ్ ను జిల్లా కేంద్రంలో అరెస్టు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.