ప్రతి యువతి తన పెళ్లి తరువాత ఉండబోయే జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది. కాబోయే భర్తతో ఎంతో సంతోషంగా జీవించాలని అమ్మాయిలు భావిస్తారు. అయితే కొందరు మాత్రం తమ ఆశలకు పూర్తి విభిన్నంగా అత్తింట్లో నరకయాతన అనుభవిస్తుంటారు. ఓ యువతి కూడా ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టి.. వారి వేధింపులకు బలైంది. ముఖ్యంగా భర్త పెట్టే కొన్ని వేధింపులను భరించలేక దారుణ నిర్ణయం తీసుకుంది.
ప్రతి యువతి తన పెళ్లి తరువాత ఉండబోయే జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది. కాబోయే భర్తతో ఎంతో సంతోషంగా జీవించాలని అమ్మాయిలు భావిస్తారు. అయితే కొందరు మాత్రం తమ ఆశలకు పూర్తి విభిన్నంగా అత్తింట్లో నరకయాతన అనుభవిస్తుంటారు. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ వేధింపుల కారణంగా కొందరు హత్యకు గురవుతుంటే, మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఓ వివాహిత వరకట్న వేధింపులకు బలైంది. ఎంతో ప్రేమగా చూసుకుంటానని మాటిచ్చిన భర్తే.. నరకం చూపించడంతో ఆ వివాహిత తీవ్ర వేదనకు గురైంది. చివరకు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన అశోక్ కుమార్ తో తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కార్నంపట్టు గ్రామానికి చెందిన నాదముని కుమార్తె నందిని(30)ని మూడేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో నాదముని అల్లుడికి కట్నకానుకలు ఘనంగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది. పెళ్లైన కొత్తలో అశోక్ కుమార్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని సమాచారం.
అదనపు కట్నం కోసం అశోక్ కుమార్ .. నందినిని వేధింపులకు గురి చేసేవాడు. అదే విషయాన్ని నందిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పెద్ద మనుషులతో పంచాయితీ జరిపి .. అశోక్ ను మందలించారు. ఆ తరువాత నందిని తిరిగి అత్తగారింట్లో ఉండేలా ఆమె తల్లిదండ్రులు ఒప్పించారు. పంచాయితీ జరిగిన కొన్ని రోజులు వరకు అశోక్ .. నందినితో బాగానే ఉన్నాడు. మళ్లీ ఇటీవల కొంతకాలం నుంచి భర్త నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. భర్త వేధింపులు ఎక్కువవడంతో భరించలేక నందిని తీవ్ర మనస్తాపానికి గురైంది. తనుకు చావే పరిష్కారంగా భావించిందో మరేమో కానీ దారుణమైన నిర్ణయం తీసుకుంది.
బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నందిని మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం పలమనేరుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలానే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి.. ఇప్పటికే ఎందరో ఆడపిల్లలు వరకట్న వేధింపులకు బలవ్వగా..తాజాగా మరో ఆడబిడ్డ ఈ రాకసికి బలైంది. ఇలాంటి వేధింపుల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.