ఈ మధ్యకాలంలో మానసిక ఒత్తిడితో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రతి చిన్న సమస్యకు తీవ్రంగా కుంగుపాటుకు లోనవుతున్నారు. తాజాగా ఓ మహిళ కానిస్టేబుల్ మానసికి ఒత్తిడి కారణంగా దారుణమైన నిర్ణయం తీసుకుంది.
నేటి సమాజంలో చాలా మందిలో ఆత్మవిశ్వాసం అనేది కొరవడింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేక పోతున్నారు. ప్రతి సమస్యకు చావే పరిష్కారంగా భావిస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఎన్నో అడ్డంకులను, సమస్యలను, ఒత్తిడిని తట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కొందరు.. విధుల్లోకి వచ్చిన తరువాత ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. కొందరు ప్రభుత్వం ఉద్యోగం పొందేందుకు చూపిన ధైర్యం.. జాబ్ వచ్చిన తరువాత కోల్పోతున్నారు. ప్రభుత్వ అధికారుల ఒత్తిడి, కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ కానిస్టేబులు అలాంటి ఘోరానికే ఒడిగట్టింది. రెండేళ్ల క్రితమే వివాహమైంది. నెలన్నర కిందటే ఓ బాబుకు జన్మనిచ్చిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్ జిల్లాకు చెందిన జ్యోతి అనే మహిళ నోహ్తా పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ పనిచేస్తుంది. ఆమెకు రెండేళ్ల క్రితం సాగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఆ దంపతులు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లోని డీ బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. జ్యోతి దంపతులు ఎంతో హాయిగా తమ కొత్త జీవితాన్ని కొనసాగిస్తున్నారు. భర్త కూడా జ్యోతిని ఎంతో అపురూపంగా చూసుకునే వాడు. ఇలా సంతోషంగా సాగిపోతున్న వారి సంసారంలో మరో సంతోషకరమైన వార్త తెలిసింది. ఆరోగ్యం గురించి ఆస్పత్రికి వెళ్తే జ్యోతి గర్భవతి అని వైద్యులు తెలిపారు. తమ ఇంటికి రాబోయే కొత్త వ్యక్తి కోసం ఆ దంపతులిద్దరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే నెలన్నర కిందట జ్యోతి పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ వీరి సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లు ఉంది. జ్యోతికి పుట్టిన బాబు పది రోజుల క్రితం చనిపోయాడు. దాంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. అది గమనించిన జ్యోతి కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స చేయించారు. ఈ క్రమంలోనే బాబు మరచిపోలేనే జ్యోతి తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. తాను నివాసం ఉంటున్న పోలీస్ క్వార్టర్స్‌లోనే ఆత్మహత్య చేసుకుంది. మరి.. ఈ దారుణమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.