సంసార సాగరంలో ఆటుపోట్లు, ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు సహజం. కొన్నిసార్లు భార్య కోర్కెలు తీర్చడంలో భర్త విఫలం కావచ్చు. అందుకు కారణం ఏదైనా కూడా అనుకున్న అన్నిసార్లు కోరింది దొరకడం కష్టం అది భార్యైనా.. భర్తైనా. కానీ అలాంటి సందర్భాల్లో సంయమనంగా వ్యవహరించకుండా కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ నిర్ణయాలు వారి జీవితాలను నాశనం చేయడమే కాకుండా మిగిలిన కుటుంబసభ్యులను కూడా క్షోభకు గురిచేస్తాయి. అలాంటి నిర్ణయంతోనే ఈ మహిళ తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ ఘటన నెల్లూరు జిల్లా ఓజిలి మండలం వజ్జవారిపాళెంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సాగర్- మాధురి(35) దంపతులు వజ్జవారిపాళంలో నివాసం ఉంటున్నారు. వారికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రెండ్రోజుల క్రితం మాధురి పుట్టింటికి వెళతానని సాగర్ ను కోరింది. అందుకు సాగర్ ససేమిరా అన్నాడు. ఇప్పుడు కాదు.. కొన్ని రోజుల తర్వాత వెళ్దువు గానీ అని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది.
వివాదం తర్వాత మాధురి మనస్తాపానికి గురైంది. ఆ క్షణికావేశంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇరుగు పొరుగు వారు గమనించి భర్తకు సమాచారం ఇచ్చారు. సాగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రి!