మనిషి బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందనేది చెప్పలేము కారణం. మనిషి తన స్థితి బట్టి బుద్ధిచాతుర్యం చూపిస్తాడు. అలా అందరూ ఉండకపోవచ్చు. కొందరు తాము ఏ స్థాయిలో ఉన్న వచ్చిన స్థితి మరచిపోరు. మరికొందరు విలువలు మరచి మృగంలా ప్రవర్తిస్తారు. అలాంటే ఓ వ్యక్తి ఏ ఉద్యోగం లేనప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించి.. “నా సర్వస్వం నీవే.. నీవులేక నేను లేను.. మనసంత నువ్వే “అని సినిమా పేర్లు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. తీరా ఉద్యోగం వచ్చాకా పెళ్లికి నిరాకరించాడు. అయిన పెద్దలు ఒప్పించడంతో తప్పక చేసుకున్నాడు. ఆ తరువాత ఆ అమ్మాయి నిత్యం నరకం చూపిస్తూ.. విడాకులు ఇవ్వలేదని ఏకంగా చంపడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని ఎస్ ఎస్ ఆర్ నెల్లూరు జిల్లాలో సంగం గ్రామానికి చెందిన నాగార్జున తనకు సమీప బంధువైన లావణ్యను 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి వివాహం అయిన రెండు నెలలకు నాగార్జునకు ఎస్సై ఉద్యోగం వచ్చింది. తన అడుగుపెట్టిన వేళ విశేషమో..ఏమో తన భర్తకు పోలీస్ జాబ్ రావడంతో లావణ్య ఆనందంతో పొంగిపోయింది. శిక్షణ పూర్తి చేసుకున్న అతనికి గుంటూరు జిల్లా అచ్చంపేట ఎస్సైగా పోస్టింగ్ వచ్చింది. అక్కడే భార్యతో కొత్త కాపురాన్ని మొదలుపెట్టాడు. కానీ నాగార్జునకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి భార్యపై అసహనం చూపిస్తున్నాడు. ఆమె కట్నం ఏమి ఇవ్వలేదని, అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో 2019లో భర్త నాగార్జున అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ ఎదుటే లావణ్య ధర్నాకు దిగింది. దీంతో పెద్దలు ఇద్దరికీ సర్దిచెప్పి కాపురానికి పంపారు.
ఐతే ఈ ఘటన తర్వాత తనకు విడాకులు కావాలంటూ నాగార్జున నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు కోర్టును నాగార్జున ఆశ్రయించాడు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మరో యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నాడని యువతి తల్లిదండ్రులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 2వ తేదీన అతడ్ని వీఆర్ కు పంపంతూ ఆదేశాలిచ్చారు.
తనపై పై అధికారులకు ఫిర్యాదు చేశారని మనస్సులో పెట్టుకున్న నాగార్జున… బుధవారం ఆత్మకూరు కోర్టుకు వాయిదా కోసం వచ్చిన భార్య లావణ్యపై కోర్టు ఆవరణలోనే విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన అత్తమామలపైన కూడా దాడి చేశాడు. భర్తదాడిలో తీవ్రంగా గాయపడిన లావణ్య ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఐతే ఇంత జరిగినా భర్తతో కాపురం చేస్తానని లావణ్య చెప్పడం గమనార్హం. అంతే కొందరు మహిళలు భర్తలనే చంపేస్తుంటే… మరికొందరు మహిళలు చంపినా… భర్తే కావాలంటారు. నెల్లూరులో జరిగిన ఈ సంఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.