మనిషి బుర్రలో పుట్టే ఆలోచన కొన్నిసార్లు అతడిని విజయంవైపు అడుగులు వేయిస్తే.. కొన్నిసార్లు అదోపాతాళానికి పడిపోతారు. అలా ఓ యువకుడి బుర్రలో పుట్టిన ఆలోచనతో అతడు- ఆమెలా మారాలి అనుకున్నాడు. అతడి శరీరంలో వచ్చిన మార్పు వల్ల అలా అనుకున్నాడో? అతడికి ఏర్పడిన బంధం వల్ల అలా ఆలోచించాడో ఎవరికీ తెలీదు. కానీ అతడు తీసుకున్న నిర్ణయానికి సరైన మార్గాన్ని ఎంచుకోకుండా.. ఖర్చుకు భయపడి స్నేహితులను ఆశ్రయించాడు. అనుభవంలేని వాళ్లు చేసిన పనికి అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సర్జరీ చేస్తామంటూ మర్మాంగాన్ని తొలగించారు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావమై అతడు ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన బి.శ్రీకాంత్ అలియాస్ అమూల్య చిన్నతనంలో తాపీ పని కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతడికి 2019లో మేనమామ కుమార్తెతో వివాహం చేశారు. కానీ, ఏమైందో తెలియదు వారు ఏడాదికల్లా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఒంటరిగానే ఉన్నాడు. విడాకుల తర్వాత హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్లిపోయాడు. ఈ గ్యాప్ లో శ్రీకాంత్ కు ట్రన్స్ జెండర్ మోనాలిసా అలియాస్ అశోక్ తో పరిచయం ఏర్పడింది. తరచూ కలవడం.. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లడం చేసేవారు.
అశోక్ తో పరిచయమో.. లేదా అతడి శరీరంలో అలాంటి మార్పులు వచ్చాయో తెలియదు. శ్రీకాంత్ కు నెల్లూరుకు చెందిన బీఫార్మసీ విద్యార్థులు మస్తాన్, జీవాలతో పరిచయం ఏర్పడింది. అతను సర్జరీ చేయించుకుని ట్రాన్స్ జెండర్ కావాలి అనుకున్న విషయాన్ని వారితో పంచుకున్నాడు. అందుకు ఏం చేయాలి అంటూ వారిని సలహా కోరాడు. అందుకు వాళ్లు మొత్తం ప్రాసెస్ చెప్పి అందుకు చాలా ఖర్చు అవుతుంది. నువ్వు ముంబై వెళ్లి ఆ సర్జరీ చేయించుకోలేవు. మేమే ఆ సర్జరీని తక్కువ ఖర్చుతో చేస్తాం అంటూ నమ్మబలికారు. శ్రీకాంత్ వారి మాటలు నమ్మి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ నెల 23న నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్లోని ఓ లాడ్జిలో శ్రీకాంత్, మస్తాన్, జీవా, మోనాలిసా దిగారు. శ్రీకాంత్ కు సర్జరీ చేసేందుకు సిద్ధమైపోయారు. అతడి మర్మాంగాన్ని కట్ చేయగానే తీవ్ర రక్తస్రావమైంది. దానిని ఎలా అదుపుచేయాలో వారికి అర్థం కాలేదు. వాళ్లు తేరుకునే సమయానికి శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జికి చేరుకుని అసలు విషయం ఏంటని విచారణ చేశారు. పోలీసులు మృతుడి బాధితుడి సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రకి తరలించారు.
మృతుడి సోదరి పల్లవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మస్తాన్, జీవా, మోనాలిసాలను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. అసలు బీ ఫార్మసీ విద్యార్థులకు లింగమార్పిడి సర్జరీ గురించి ఎలా తెలుసు? యూట్యూబ్ లో చూసి వాళ్లు ఈ సాహసానికి ఒడిగట్టారా? లేక సరదాకి అలా చేసి శ్రీకాంత్ ప్రాణాలు తీశారా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.