భార్య ఉరేసుకుంటుంటే చూస్తూ ఉండటమే కాకుండా.. వీడియో తీసి బంధువులకు పంపిన పెంచలయ్య షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తాను కూడా భార్య సమాధి దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషయమించడంతో వైద్యం కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందు తాగే ముందు పెంచలయ్య ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఆ వీడియోలో తన భార్య, తన చావుకు కొందరు కారణం అంటూ ఆరోపించాడు. భార్య చనిపోతుండగా వీడియో తీసిన ఘటనలో పెంచలయ్య ఇటీవలే బెయిల్ పై బయటికొచ్చాడు.
అసలు ఏం జరిగిందంటే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పెంచలయ్య- కొండమ్మ దంపతులు నివాసముంటున్నారు. మెప్మాలో పెంచలమ్మ రిసోర్స్ నర్సుగా విధులు నిర్వహిస్తోంది. కొండమ్మ గతేడాది సెప్టెంబరులో ఓరోజు ఉరేసుకుంటుంటే.. పెంచలయ్య ఆపకపోగా.. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. అంతేకాకుండా ఆ వీడియో బంధువులకు పంపి పైశాచికానందాన్ని పొందాడు. ఆ వీడియో ఆ సమయంలో వైరల్ అయ్యింది. అదే కేసులో పెంచలయ్య జైలుకు కూడా వెళ్లాడు. ఇటీవల బెయిల్ పై విడుదల అయ్యాడు. సెల్ఫీ వీడియో తీసి తన భార్య, తన చావుకు కొందరు కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసి పురుగులమందు తాగాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.