ఆ దొంగ ఒక్క ఇళ్లు కాదు..వంద ఇళ్లలో చోరీ చేశాడు. కానీ చాలా కాలం పాటు పోలీసులకు చిక్కకుండా తిరిగాడు. పోలీసులు పట్టుకోకుండ ఉండటం కోసం అతడు ఫోన్ సైతం వినియోగించ లేదు. అతడు పద్నాలుగేళ్ల వయస్సులోనే దొంగతనాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తాళం వేసిన భవంతులు కనిపిస్తే వదలడు. ఓ ప్రాంతంలో చోరీ చేయాలంటే ముందు ఆ పరిసరాలపై అవగాహన చేసుకుంటాడు. అక్కడ ధనవంతులను గుర్తించి ఆ పరిసరాల్లోనే ఇళ్లు అద్దెకు తీసుకోని తలదాచుకుంటాడు. అనంతరం కొన్ని రోజులకు దొంగతనానికి పాల్పడి అక్కడి నుంచి ఉడాయిస్తాడు. ఇలా ఒక్క ప్రాంతాలంలో కాదు , ఒక్క జిల్లాలో కాదు, ఏకంగా ఆరు జిల్లాలో వందకు పైగా దొంగతనాలు చేశాడు. చివరికి కావలి పోలీసులకు దొరిపోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లాలోని గాజువాకకు చెందిన బోలా సాయి(30) చిన్నప్పటి నుంచే దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. నేరం చేయండ జైలు వెళ్లడం తిరిగి వచ్చి అదే చోరీలను కొనసాగిస్తున్నాడు. ఇలా తూర్పు గోదావరి, పశ్చిగోదావరి, చిత్తూరు, కడప, హైదరాబాద్,బెంగుళూరు, చెన్నై నగరాల్లో పలు చోరీలకు పాల్పడ్డాడు. దొంగిలించిన సొమ్మును విలాసాలకు వినియోగించేవాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చి నెల్లూరు జిల్లా కావలిలోని ముసునూరు రాఘవేంద్ర కాలనీలో రెండు గృహాల్లో చోరీకి పాల్పడ్డాడు. ఆ ప్రాంతంలోనే అతను ఉన్నాడనే పక్కా సమాచారంతో కావలి పోలీసులు ముసునూరులో గాలించి చివరికి అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 184 గ్రాముల బంగారం, 315 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి పట్టుకున్న కావలి గ్రామీణ సీఐ ఖాజావలి, ఎస్సై వెంకట్రావును డీఎస్పీ ప్రసాద్ అభినందించారు.