సమాజంలో అవకాశవాదులు, కోరుకున్న దానికోసం దిగజారిపోయే వాళ్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. అనుకున్నది సాధించడం కోసం, వారి కోరికలు తీర్చుకోవడం కోసం కొందరు మరీ దిగజారిపోతున్నారు. ఓ దుర్మార్గుడు తన కోరిక తీర్చుకోవడం కోసం ఓ దివ్యాగురాలికి పెళ్లి అనే పేరుతో ఆశ చూపించాడు. ఆ తర్వాత ఆమెను తన గదికి తీసుకెళ్లి నాలుగు రోజులపాటు తన కోరికలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమె కోసం పోలీసులు వస్తున్నారని తెలిసుకున్నాడు. ఆమెను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి దారిలో ఆమెపై పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. చికిత్స పొందుతున్న ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లెకు చెందిన కృష్ణవేణి(21) తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లో కూలిపనులకు వెళ్తోంది. ఉప్పరపల్లి ప్రాంతంలోనే ఉండే వెంకట్రాములు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అతనికి పెళ్లి కాలేదని నమ్మబలికాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. తనలో ఉన్న లోపాన్ని చూడకుండా తనను ప్రేమిస్తున్నాడు అనుకుని ఆ యువతి భ్రమపడింది. అతనిపై ఇష్టాన్ని పెంచుకుంది. అతను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానంటూ చెబుతాడా అని ఎదురుచూపులు మొదలుపెట్టింది. కానీ, అదంతా ఒక డ్రామా అని తెలుసుకోలేక పోయింది.
ఫిబ్రవరి 12న యువతి తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు. ఆరోజు కృష్ణవేణిని తీసుకుని వెంకట్రాములు అరె మైసమ్మ ప్రాంతంలోని తన గదికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు మాయమాటలు చెబుతూ తన కోరికలు తీర్చుకోవడం మొదలు పెట్టాడు. తనతో పెళ్లి అంటే యువతి తల్లిదండ్రులు ఒప్పుకోరని.. వివాహం చేసుకున్నాక ఇంటికి వెళ్దామని చెప్పడంతో ఆమె అంగీకరించింది. నాలుగు రోజుల పాటు తన కోరికలు తీర్చుకున్నాడు. ఆమెను సుఖాలు తీర్చే ఒక యంత్రం అన్న భావనలోకి వెళ్లిపోయాడు. వెంకట్రాములు ఒకటి అనుకుంటే పరిస్థితి రివర్స్ అయ్యింది.
కృష్ణవేణి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అదేరోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వెంకట్రాములపై అనుమానం ఉన్నట్లు తెలిపారు. పోలీసులు వెంకట్రాములకు ఫోన్ చేసి కృష్ణవేణి ఆచూకీ అడగగా తనకు తెలియదంటూ బుకాయించాడు. కానీ వెంకట్రాముల్లో టెన్షన్ మొదలైంది. ఇంకా ఆలస్యం చేస్తే పోలీసులకు దొరికిపోతానని భావించాడు. ఆ తర్వాత కృష్ణవేణికి అసలు విషయం చెప్పేశాడు. తనకి గతంలోనే వివాహం జరిగిందని చెప్పాడు. ఆ విషయం విన్న ఆమెకు ఏమీ అర్థం కాలేదు. తాను మోస పోయానని గ్రహించింది. వెంటనే వెంకట్రాములను నిలదీశింది. తన పరిస్థితి ఏంటో చెప్పాలంటూ గొడవకు దిగింది. ఆమెను ఎలాగైనా కూల్ చేయాలని మరో పథకం వేశాడు.
ఇదీ చదవండి: ఛీ.. కన్న కూతురుని చంపి.. అత్యాచారం! వీడు మనిషేనా!
స్వగ్రామం తిమ్మారెడ్డిపల్లె తీసుకెళ్తానని నమ్మించాడు. ఫిబ్రవరి 18న కృష్ణవేణిని తీసుకుని బయల్దేరాడు. మార్గం మధ్యలో ముద్దురులో ఓ రెసిడెన్షియల్ స్కూల్ వసతిగృహం వెనుక భాగంలో ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను బలవంతంగా ఆ ప్రాంతానికి లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై పెట్రోలు పోసి సజీవగాం నిప్పంటించాడు. అది గమనించిన సిబ్బంది మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణవేణి రెండ్రోజుల క్రితం మృతిచెందింది. తల్లిదండ్రులకు విషయం తెలిపారు. గతంలోనే వెంకట్రాములుపై ఫిర్యాదు ఉండటంతో.. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. రెండ్రోజుల పాటు గాలించి వెంకట్రాములను అరెస్టు చేశారు. ఆమె లోపాన్ని ఆసరాగా తీసుకుని ఆమెతో తన కోరికలు తీర్చుకున్నాడు. చివరికి పెళ్లి అనేసరికి బతికుండగానే కాల్చి చంపేశాడు. అలాంటి దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.