ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. పని వత్తిడి, ప్రేమలో విఫలం, ఆస్తి గొడవలు కారణాలు ఏవైనా తీవ్రమైన ఆవేదనకు లోనై మానసికంగా కుంగిపోతున్నారు. ఆ సమయంలో క్షణికావేశంలో ఎదుటివారిపై దాడులు చేయడం.. తమను తాము శిక్షించుకోవడం లాంటివి చేస్తున్నారు.
ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై క్షణికావేశంలో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం.. చంపేయడం లేదా ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. మంచీ చెడూ అనే విచక్షణ కోల్పోయి ఐనవారినే చంపుతున్న దారుణమై ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీలోని శ్రద్దా వాకర్ హత్య కేసు తర్వాత ఆ తరహా కేసులు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఓ కూతురు సొంత తల్లినే దారుణంగా చంపి ముక్కలు గా చేసి ప్లాస్టిక్ కవర్ లో దాచింది. ఈ దారుణ ఘటన ముంబాయిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.
మహారాష్ట్ర ముంబాయిలో కన్నతల్లిని చంపి ముక్కలుగా చేసి ప్లాస్టీక్ బ్యాగ్ లో దాచిన ఓ కసాయి కూతురు వ్యవహారం పోలీసులు బయటపెట్టారు. ఈ సంఘటన ముంబాయిలో తీవ్ర కలకలం రేపింది. ముంబాయి ఇబ్రహీం కసమ్ భవనంలోని మొదటి అంతస్తులో ప్లాస్టిక్ కవర్ లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహం బయట పడింది. హత్యకు గురైన మహిళ వయసు 55 సంవత్సరాలు ఉంటాయని ముంబాయి డీసీపీ ప్రవీణ్ ముండే తెలిపారు. ఈ కేసు విషయంలో ఆమె 22 ఏళ్ల కూతురుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మంగళవారం ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
మృతురాలి సోదరుడు, అల్లుడు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు అపార్టె మెంట్ లోకి వెళ్లి అక్కడ వెతికారు.. వాళ్లకు ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లభించింది. ఆ బ్యాగ్ విప్పి చూస్తూ శరీర అవయావాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. తల్లితో పాటు ఉంటున్న కూతరుపై అనుమానంతో వెంటనే అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. అయితే కూతురు తల్లిని చంపి ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి కొన్ని నెలల పాటు అక్కడ ఉందుకు ఉంచింది అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు. ప్రస్తుతం మృతురాలి కూతురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన దేశధానిలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది.
ఇటీవల ఈ తరహా హత్య కేసులు ఎన్నో బయటపడుతున్నాయి. సమాజంలో మన మధ్యనే ఉంటే ఇంతటి ఘోరాలకు పాల్పపడుతున్నారు దుర్మార్గులు. హత్య చేసి శరీర భాగాలను ముక్కలు చేసి ఇంట్లోనే దాచి ఉంచుతున్న ఘటనలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఢిల్లీలో శ్రద్దా వాకర్ హత్య తర్వాత ఈ తరహా ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తెలంగాణలో నవీన్ హత్యా ఉదంతం ఎన్నో సంచలనాలకు తెరలేపింది. మనతో కలిసి మెలిసి ఉండేవాళ్లనే దారుణంగా చంపి ముక్కలు చేయడం శాడీజం, సైకో మనస్థత్వం ఉన్నవారే ఇలాంటి అకృత్యాలకు పాల్పపడతారని వైద్యులు చెబుతున్నారు.
Mumbai | The decomposed body of a 53-year-old woman was found in a plastic bag in Lalbhaug area. The 22-year-old daughter of the deceased woman was taken into custody by the police for questioning. Police took the body into custody and sent it for postmortem: DCP Pravin Mundhe pic.twitter.com/2AlVS225XV
— ANI (@ANI) March 15, 2023