దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎన్నటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అధికారులు అంటున్నారు.
దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు.. వికలాంగులుగా మారిపోతున్నారు. పెద్ద దిక్కు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. తాజాగా ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై, జీప్ డ్రైవర్ మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ములుగు జిల్లాలో వెంకటాపురం నూగూరు మండలంలో ఉన్నతాధికారులు సమావేశం జరిగింది. ఈ సమావేశం పూర్తి అయిన తర్వాత భద్రాచలం ఉన్నతాధికారులకు ఎసకార్ట్ గా ఏటూరి నాగారం పోలీస్ స్టేషన్ రెండో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న డి ఇంద్రయ్య, కానిస్టేబుల్ శ్రీనివాస్ తో పాటు డ్రైవర్ చెట్టుపల్లి రాజు తో కలిసి బయలుదేరారు. జీడివాగు లో లెవిల్ కాజ్ వే సేఫ్టీ పిల్లర్స్ కి తగిలి ఒక్కసారిగా జీపు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఎస్ఐ ఇంద్రయ్యతో పాటు డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసుకొని హుటాహుటిన సంఘటన స్థలానికి ములుగు ఎస్పీ గౌస్ ఆలం చేరుకొని పరిస్థితి పరిశీలించారు. కాగా, ఎస్ఐ ఇంద్రయ్య స్వస్థలం హనుమకొండ జిల్లా పలివేలుపురం గ్రామం. ఇక డ్రైవర్ రాజు ది ములుగు జిల్లా కాటాపురం గ్రామం అని పోలీసులు తెలిపారు. దీంతో ఇరు గ్రామాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.