ముందుగా ఓ మగబిడ్డకు జన్మిస్తే బాగుండు అని చాలా మంది దంపతులు ఆశపడుతుంటారు. ఇక ఇంతటితో ఆగక ఈ మధ్యకాలంలో మగబిడ్డ కోసం కొంతమంది భార్యాభర్తలు నాటు మందులు వాడుతు చివరికి చేతులు కాల్చుకుంటున్నారు. అలా ఓ మగ బిడ్డ పుడతాడని ఆశపడ్డ ఓ నిండు గర్భిణి ఆడపిల్ల పుడుతుందేమనన్న భయంతో బలవన్మరణానికి పాల్పడింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం మగబిడ్డ అని తేలింది. తాజాగా మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రమ్య అనే మహిళకు ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఆనంద్ అనే వ్యక్తికి ఇచ్చి 2017లో వివాహం చేశారు. పెళ్లైన రెండేళ్ల అనంతరం ఈ దంపతులకు ఓ ఆడబిడ్డ జన్మించింది. అయితే ప్రస్తుతం రమ్య 9 నెలల గర్భవతితో ఉంది. ఈ సారైన మగబిడ్డ పుట్టాలని అనేక దేవతలను ప్రార్థించింది. ఇక రెండు మూడు రోజుల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన రమ్య మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడింది. రమ్య మరణవార్త తెలుసుకున్నభర్త, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.ఇక అనంతరం పోలీసుల సాయంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. రిపోర్టులో మాత్రం రమ్య కడుపులో ఉన్నది ఆడపిల్ల కాదని, మగబిడ్డ అని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న రమ్య కుటుంబ సభ్యులు అయ్యో రమ్య.. ఎందుకమ్మ తొందరపడ్డావు అంటూ కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. రమ్య మరణవార్తతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. రమ్య తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.