మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడలిని భర్త తండ్రి అత్యంత కిరాతంగా హత్య చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది జిల్లాలోని కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామం. సాయికృష్ణ, సౌందర్య ఇద్దరు భార్యాభర్తలు. ఒకే ఊరికి చెందిన వీరిద్దరు ఏడాది కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. కానీ కొన్నాళ్లకి గొడవలు మొదలయ్యాయి.
ఇక రోజులు గడుస్తున్న కొద్ది భర్త సాయికృష్ణ తాగుడుకు అలవాటు పడి తాగుబోతుగా మారాడు. ఇదిలా ఉంటే గత మూడు నెలల క్రితం సౌందర్య భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తన కుమారుడు మరణానికి తమ కోడలు సౌందర్యే కారణమని సాయికృష్ణ తండ్రి తిరుపతి అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేస్తుండేవాడు. ఇక భర్త మరణంతో సౌందర్య తన పుట్టింట్లో ఉంటుంది. కాగా కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన తండ్రి తిరుపతి కోడలిపై పగను మరింత పెంచుకున్నాడు. ఎలాగైన తన కోడలిని హత్య చేయాలని భావించాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనుకుంటున్నట్లుగానే ఓ పథకం కూడా రచించాడు. అయితే సోమవారం రోజు పక్క ప్లాన్ తో ఇంట్లోకి వెళ్లిన మామ సౌందర్యను కత్తితో పరిగెత్తించి పరిగెత్తించి హత్య చేశాడు. ఈ దాడిలో కోడలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ క్రమంలో కోడలి తండ్రి అడ్డొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసినా అస్సలు తగ్గకుండా తన కోడలిపై ఉన్న పగను తీర్చుకున్నాడు. ఈ ఘటనపై సౌందర్య తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన తిరుపతిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కోడలిపై పగ తీర్చుకుని పరుగెత్తించి హత్య చేసిన మామ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.