నేటి కాలంలో కొందరు భార్యాభర్తలు ఒకిరికి తెలియకుండా ఒకరు తెర వెనుక కాపురానికి రెడీ అవుతున్నారు. తీరా వారి చీకటి సంసారం బట్టబయలవ్వడంతో క్లైమాక్స్ లో హత్యలు, ఆత్మహత్య జరుగుతున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మహారాష్ట్రలోని పాల్గూర్ జిల్లా తులింజ్ గ్రామం. రమేష్ మెహతా, నీలం దేవి ఇద్దరు భార్యాభర్తలు. పెళ్లైన నాటి నుంచి వీరి కాపురం ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో హాయిగా, సంతోషంగా సాగుతూ వస్తుంది.
అయితే భర్త వ్యాపార రంగంలో కాస్త బిజీగా మారాడు. పనులు ముగించుకుని ఇంటికి కాస్త లేటుగా వస్తున్నాడు. అలా అలా కొన్నాళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఇక కొంత కాలం తర్వాత భర్త గడప దాటే లోపే రోజు భార్య ఎంతో అందంగా ముస్తాబవుతూ ఉండేది. దీంతో భర్తకు భార్యపై అనుమానం చిగురించింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. భర్త రమేష్ మెహతాకు భార్య నీలం దేవిపై అనుమానాం రాను రాను మరింత హద్దులు దాటింది. ఇక ఇటీవల భార్యపై భర్త కోపంతో రగిలిపోయి అసలు విషయం ఏంటంటూ ఆరా తీశాడు.
దీనికి భార్య నీలం దేవి కూడా గొంతులు పగిలేల గట్టిగా అరిచింది. దీంతో విరిద్దరి మధ్య వివాదం చినిగి చినిగి గాలి వానలా తయారైంది. ఇక కోపంతో రగిలిపోయిన భర్త రమేష్ మోహతా భార్యను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. వెంటనే భార్య అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. దీంతో భయంతో భర్త ఊరే కాదు రాష్ట్రాన్ని దాటి ఏకంగా గుజరాత్ లో వాలిపోయాడు. ఇక భార్య తల్లిదండ్రులు రమేష్ మెహతా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుజరాత్ లో తలదార్చుకున్న రమేష్ మెహతాను వెతికి పట్టుకున్నారు. పోలీసులు ప్రశ్నించే సరికి నా భార్య నన్ను మోసం చేసిందని, అందుకే హత్య చేశానంటూ వివరణ ఇచ్చాడు. ఇక ఎట్టకేలకు అతనిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అనుమానంతో రగిలిపోయిన భర్త ఏకంగా భార్యపై ఇంతటి దారుణానికి పాల్పడడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.