పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు.. కారణాలు ఏవైనా ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురికావడం.. డిప్రేషన్ లోకి వెళ్లడం జరుగుతుంది. డ్రిపేషన్ లో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.
మనిషి జీవితం ఎంతో విలువైంది.. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి పోరాడాలని అంటారు. కానీ ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాము జీవితంలో ఏదీ సాధించలేమని.. తాము చేసిన పొరపాటు మన్నించలేనిదని.. తమ వల్ల ఎవరికీ ఏ కష్టం రాకూడదని ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. తాను చేసిన చిన్న పొరపాటు వల్ల తల్లిదండ్రులకు ముఖం చూపించలేక డిగ్రీ యువతి తనువు చాలించింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్.. దంతాలపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకి రాములు- రాణి దంపతులకు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు హేమలతారెడ్డి వయసు 19 సంవత్సరాలు. ఓ ప్రైవేట్ కాలేజ్ లో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతుంది. చిన్న కూతురు అశ్విత మరిపెడలో ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతుంది. ఉగాది పండుగకు హేమలత ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిపింది. అయితే హేమలత చేతికి ఉన్న ఉంగరం ఎక్కడో పడిపోయింది. దాంతో ఒక్కసారిగా భయపడిపోయిన హేమలత ఇల్లు, చుట్టుపక్కల అంతా వెతికింది.. కానీ ఉంగరం మాత్రం కనిపించలేదు. ఆరు నెలల క్రితమే బంగారు చైన్ పోగొట్టుకున్న హేమలత ఇప్పుడు ఉంగరం కూడా పోగొట్టుకోవడంతో తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో మనోవేదనకు గురైంది.
ఈ నేపథ్యంలో ‘సారీ డాడీ.. నాకు భయమేస్తుంది’ అంటూ లేఖలో రాసి పెట్టి ఫ్యాన్ కి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పొలం పనులు చూసుకొని సాయంత్రం ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు తలుపులు తట్టారు. ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తెరిచి ఇంట్లోకి వెళ్లి చూడగా హేమలత ఫ్యాన్ కి ఉరివేసుకుంది. వెంటనే ఆమెను కిందకు దింపి కాపాడేందుకు ప్రయత్నించారు.. అప్పటికే కన్నుమూసినట్టు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. హేమలత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు ఎస్సై జగదీశ్. హేమలత ఉంగరం పోయినందుకే ఉరి వేసుకుందా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.