విలువలు, వావివరసలు అనే పదాలకు ఈ సమాజంలో చాలా మందికి అర్థం కూడా తెలిసినట్లు లేదు. కేవలం క్షణకాల సుఖం కోసం నైతిక విలువల్ని మరిచి.. దుర్మాగంగా నడుచుకుంటున్న ఘటనలు ఎన్నో చూశాం. అలాంటి అత్యంత దారుణ, కిరాతక, అమానుష ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే ఇది కూడా. భర్తపోయి కుమార్తెతో ఉంటున్న ఓ స్త్రీని వివాహం చేసుకున్నాడు. బిడ్డకు తండ్రి దొరికాడని ఆ తల్లి ఎంతో సంతోష పడింది. కానీ, అతని చీకటి కోణం తెలిశాక షాకైంది. అది కరెక్ట్ కాదని వారించింది. అందుకు కుమార్తెను తీసుకుని ఆ సవతి తండ్రి లేచిపోయాడు.
విషయం ఏంటంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో జరిగింది ఈ దారుణ ఘటన. ఇండోర్ కు చెందిన ఓ మహిళ భర్త పోవడంతో తన కుమార్తెతో ఒంటరిగా ఉంటోంది. ఆమె కోసం కాకపోయినా తన కుమార్తెకు తండ్రిగా అయినా ఒకరు కావాలని మళ్లీ పెళ్లి చేసుకుంది. కూతురికి ఓ తండ్రి దొరికాడని ఆమె ఎంతో సంబర పడిపోయింది. ఆమె ఆశలు ఆవిరవ్వడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఆవిడ తండ్రి దొరికాడని అనుకుంది కానీ, అతను మేక తోలు కప్పుకున్న తోడేలని గుర్తించలేకపోయింది. ఆమెకు అసలు విషయం తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
తల్లిని పెళ్లాడి కూతురిపై కన్నేశాడు. తెలిసి తెలియని వయసు.. మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. చేయకూడని తప్పులు చేశాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా తనవైపు తిప్పుకున్నాడు. ఎంతగా అంటే.. అది తప్పు అని కన్నతల్లి చెప్పినా కూడా ఆ కూతురు వినే పరిస్థితి లేనంతగా. పెళ్లైన 15 రోజులకు కూతురి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లి.. నిఘా ఉంచింది. అసలు విషయం తెలిసి ఆమెకు నోట మాట రాలేదు. తండ్రి అనుకన్న వాడు కూతురిపై కన్నేశాడని తెలుసుకుంది. ఇది తప్పు అని ఇద్దరికీ చెప్పి చూసింది. నిర్ణయం మార్చుకోవాలని కాళ్లా వేళ్లా పడింది. కానీ, వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక్కడే ఉంటే వారి బంధానికి ఆవిడ అడ్డుగా అవుతుందని భావించారు. ఎవరికీ తెలీకుండా ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.
ఈ విషయం తెలిసి ఆ తల్లి కుమిలి కుమిలి ఏడ్చింది. ఎవరికి చెప్పుకోవాలో తెలీక మదన పడిపోయింది. చివరికి పోలీసులను ఆశ్రయించింది. అసలు విషయం ఇదీ అని.. మొత్తం చెప్పింది. ఎలాగైనా వాళ్లను పట్టుకుని తిరిగి తన కుమార్తెను తీసుకురావాలని ప్రాథేయపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాళ్ల కోసం వెతకడం మొదలు పెట్టారు. తండ్రి స్థానం ఇస్తే.. తప్పుడు పని చేశాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వ్యక్తే కాటేశాడు. ఇంతటి దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.