గత కొంత కాలంగా దేశంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. నిర్లక్ష్యం, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు నర్మదా నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే..
ఇండోర్ నుంచి పూణే వెళ్తున్న బస్సు వంతెనపై ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా రేలింగ్ కి గట్టిగా తాకడంతో నదిలోకి దూసుకు వెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందగా.. 15 మందిని కాపాడినట్లు రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
ప్రమాదం జరిగిన విషయం తెలిసుకున్న మద్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వెంటనే సహాయక చర్యల నిమిత్తం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను ఘటన స్థలానికి పంపాలని ఆదేశించారు. స్థానిక మత్స్యకారులు కూడా సహాయకచర్యల్లో అధికార యంత్రాగానికి సహాకారం అందిస్తున్నారు. క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని సూచించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Video: At least 12 people have been killed after a Pune-bound bus plunged into #Narmada river in Madhya Pradesh’s #Dhar district on Monday morning pic.twitter.com/SyFyAoZ6cw
— TOI Bhopal (@TOIBhopalNews) July 18, 2022
ఇది చదవండి:కుప్ప కూలిన కార్గో విమానం.. 8 మంది సిబ్బంది దుర్మరణం!