సాధారణంగా సమాజంలో పెళ్లి అనేది ఎవరైన ఒక్కసారే చేసుకుంటారు. కొంత మంది మనస్పర్థల కారణంగా మహా అయితే రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ.. ఓ మహిళ మాత్రం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుంది. ఈమె ఎవరితో కూడా పట్టుమని పదేళ్లు కాపురం చేయలేదు. చివరికి ఐదో భర్తతో ఉంటూ కూడా తన బుద్ధిని వక్రమార్గంలో పెట్టింది. శారీరక సుఖం కోసం అడ్డదారి తొక్కింది. చివరికి ఆమె వెళ్లిన ఆ అడ్డదారే ఆమెను బలితీసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఇది కూడా చదవండి:
విషాదం: భార్య, అత్తింటి వేధింపులు తాళలేక..
మధ్యప్రదేశ్ కు చెందిన శారద అనే మహిళ మొదట ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంది. అతనితో పోసగక వదిలేసి మరొకరిని చేసుకుంది. అతనితో కూడా విడిపోయింది. ఇలా వరుసగా నలుగురిని చేసుకుంది. నాలుగో వ్యక్తితో కూడా మనస్పర్థలు రావడంతో అతన్ని వదిలేసింది. శారద బుద్ది గ్రహించని కుల్దీప్ అనే వ్యక్తి ఐదో భర్తగా ఆమెకు మారాడు. ఈ క్రమంలో వారికి ఓ బాబు కూడా జన్మించాడు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో శారద చెడు బుద్ధి.. ఆ దంపతుల మధ్య ఘర్షణలకు దారితీసింది. శారద మొదటి భర్త మంగేశ్ ఆమెకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ లోకి వచ్చాడు. దీంతో తన సంసార విషయాలు మంగేశ్ కు శారద చెప్పుకునేది. మళ్లీ పెళ్లైన మంగేశ్ కూడా ఇదే అదునుగా భావించి ఆమె శారీరకంగా దగ్గర కావాలనే కన్నీంగ్ ప్లాన్ వేశాడు. ఆమె చెప్పిన బాధలు వింటూ ఓదార్చినట్లు నటించి.. శారద దంపతుల మధ్య గొడవలు పెంచేవాడు. ఈ సమయంలోనే శారద ఐదో భర్త కుల్దీప్ కుటుంబ సమేతంగా ఇండోర్ వెళ్లాడు. అక్కడే ఉంటున్న మంగేశ్ కు శారద విషయం చెప్పింది. దీంతో కుటుంబ సమేతంగా వారిని తన ఇంటికి ఆహ్వానించాడు.
కుల్దీప్ అత్యవసర పని మీద బయటకు వెళ్లగా.. ఇదే అదనుగా భావించిన శారద మంగేశ్ కామక్రీడలో మునిగిపోయారు. పని ముంగిచుకుని ఇంటికి వచ్చిన కుల్దీప్.. వారిని ఆస్థితిలో చూసి కోపంతో రగిలిపోయాడు. ఆరోజు రాత్రి అందరూ నిద్రిస్తుండా భార్య, కుమారుడిని కత్తితో గొంతుకోసి చంపేశాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.