కొందరు పవిత్రమైన తాళిని ఎగతాళి చేస్తున్న సందర్భాలను చూస్తూనే ఉన్నాం. మూడుముళ్ల బంధం కంటే ఐదు నిమిషాల సుఖానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అందుకోసం బాధ్యతగా ఉన్న భర్తైనా.. అడ్డుగా ఉన్న పిల్లలినైనా అడ్డుతప్పించుకునేందుకు వెనుకాడటం లేదు. అలాంటి ఓ మహిళ కథే ఇది. ప్రియుడి మోజులో పడిపోయి కట్టుకున్న భర్తనే కాటికి పంపింది. పైగా అదంతా ప్రమాదం అంటూ పెద్ద డ్రామానే వేసింది. కానీ, ఎక్కువరోజులు నటనను కంటిన్యూ చేయలేక చివరికి దొరికిపోయింది. ఉంచుకున్న వ్యక్తితో కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించి.. చివరికి కటకటాల పాలైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసులకే షాక్ కు గురిచేసింది. మహానంది మండలంలోని తమ్ముడపల్లె గ్రామానికి చెందిన డొక్కా కృష్ణయ్య- డొక్కా విజయలక్ష్మి దంపతులు నివాసముండేవారు. వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు, గొడవలు, వివాదాలు ఏమీ లేవు. అక్కడుండే వారితోనూ ఎలాంటి గొడవలు లేవు. గతేడాది నవంబరు 19న సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన కృష్ణయ్య తిరిగి ఇంటికి రాలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నవంబరు 21న కృష్ణయ్య మృతదేహం నంద్యాల మండలం పాలేరు బ్రిడ్జి పెద్దకొట్టాల గ్రామం సమీపంలో లభించింది.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. మొదట కేసును ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కాని పోలీసులు భార్యపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పోలీసుల ప్రశ్నలకు విజయలక్ష్మి పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. సీక్రెట్ గా విజయలక్ష్మిపై నిఘా ఉంచారు. విజయలక్ష్మికి అదే గ్రామానికి చెందిన చింతలన్న అనే వ్యక్తితో చీకటి సంసారం చేస్తున్న విషయం తెలిసింది. తమ తప్పుడు బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య అతడ్ని హత మార్చింది.
ఇదీ చదవండి: భర్త ఉండగా ప్రియుళ్లతో బరితెగించిన భార్య.. క్లైమాక్స్ లో షాకింగ్ సీన్!
చింతలన్న అతడి స్నేహితులు వెంకటసాయి, సుధాకర్, శివరాజ్ లతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న కృష్ణయ్యపై దాడి చేశారు. గాయాలపాలైన అతడిని వాగులో పడేశారు. ఈతరాని కృష్ణయ్య వాగులో మునిగి చనిపోయాడు. భార్య చెప్పిన వివరాలతో నిందితులను పోలీసులు అదుపులోతి తీసుకున్నారు. ఒకరు పరారీలో ఉన్నారు. జీవితం కన్నా సుఖమే ముఖ్యం అనుకుంది. కానీ, చివరికి ఆ జీవితాన్నే కోల్పోయింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.