భార్య కళ్లుగప్పి రెండో పెళ్లికి రెడీ! తీరా తాళి కట్టే సమాయానికి..

కట్నం తీసుకునే వాడు గాడిద అంటారు. అయితి ఇప్పడు చెప్పుకోబోయే వ్యక్తిని అడ్డగాడిద అనాలేమో? ఎందుకంటే మొదట పెళ్లి చేసుకుని అదనపుకట్నం కావాలని కుటుంబం మొత్తం కలిసి వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత ఆ గొడవలు, వేధింపులు తాళలేక ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారి మధ్య సఖ్యత కుదరలేదు. అలాగని విడాకులు కూడా తీసుకోలేదు. ఇద్దరూ దూరంగానే ఉంటున్నారు. అయితే ఆమెతో విడాకులు తీసుకోవడం, లేదా ఆమెతో కలిసుండటం ఈ రెంటూ చేయకుండా ఆ ప్రబుద్ధుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అది కూడా ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా మూడుసార్లు ఆ ప్రయత్నం చేశాడు. ముచ్చటగా మూడోసారి కూడా ఆ భార్య ఎంట్రీతో అది సాధ్యం కాలేదు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కు చెందిన సీహెచ్ సరితను భువనగిరికి చెందిన చెర్కుపల్లి మధుబాబు 2016లో వివాహం చేసుకున్నాడు. అయితే అదనపు కట్నం కోసం పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే వేధింపులు మొదలు పెట్టాడు. భర్త ఒక్కడే కాదు.. అత్తమామలు, ఆడపడుచు అంతా ఎప్పుడూ సూటిపోటి మాటలతో విసిగించేవారు. వారి వేధింపులు తాళలేక సరిత తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరూ విడిగానే ఉంటున్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత మధుబాబు రెండో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సరితకు విడాకులు ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకోవాలని పథకం పన్నాడు.

ఆదివారం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని తిరుపతమ్మ తల్లి ఆలయంలో రెండో పెళ్లి చేసుకుంటున్నాడని సరితకు తెలిసింది. వెంటనే తన వద్ద ఉన్న ఆధారాలతో పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తనకు విడాకులు ఇవ్వకుండానే.. మరో యువతిని రెండో పెళ్లి చేసుకుంటున్నాడని ఫిర్యాదు చేసింది. సరిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి ఆలయంలో జరుగుతున్న మధుబాబు వివాహాన్ని అడ్డుకున్నారు. మధుబాబును అదుపులోకి తీసుకున్నారు. మొదటి భార్యను మోసం చేయాలని చూసిన మధుబాబుపై విచారణ చేపట్టారు. కట్నంకోసం ఆశపడే ఇలా రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు సరిత ఆరోపిచింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇంట్లో పని చేసే డ్రైవర్ తో ప్రేమ! చివరికి ట్విస్ట్ ఊహించలేరు!

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV