అప్పులు, అధిక వడ్డీలు, ఆపై ఒత్తిళ్లు వెరసి ఓ చేనేత కుటుంబం బలవన్మరణానికి పాల్డేలా చేశాయి. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా పెడనలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాసిన పద్మనాభం(55), నాగలీలావతి(47) దంపతులకు రాజా నాగేంద్రం(27), వెంకట నాగలక్ష్మి సంతానం. వృత్తిపరంగా చేనేత కార్మికులైన పద్మనాభం.. కుమార్తె వివాహం కోసమని గతేడాది విఠల్ లోకేష్, జీవనప్రసాద్ ల వద్ద రూ.2.60 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఏడాదిలోగా అప్పు, వడ్డీ కలిపి రూ.4.60 లక్షలకు చేరుకుంది. అందులో రూ.1.86 లక్షలు వచ్చే మార్చి నాటికి చెల్లించాలని నోటరీ రాయించుకున్నారు. చెల్లించని పక్షంలో సివిల్, క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.
ఇచ్చిన గడువులోపు ఆ అప్పు కట్టడం సాధ్యం కాదని ఆ కుటుంబానికి తెలుసు. కట్టకపోతే అప్పు ఇచ్చిన వాళ్లు కేసులు పెడతారనే భయం వారిలో మొదలైంది. ఏం చేయాలో పాలుపోక కుటుంబం మొత్తం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారుజామున పాలవాడు వచ్చి ఎంత తలుపు కొట్టినా తీయకపోవడంతో పక్కింటి వారికి చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత కుమార్తె వాళ్లు వచ్చి ఎంతసేపు పిలిచినా ఎవరూ రాలేదు. తలుపులు బద్దలు కొట్టారు. లోపల చూస్తే ఓ గదిలో పద్మనాభం, మరో గదిలో నాగలీలావతి, రాజా నాగేంద్రం ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచరమిచ్చారు.
వారి ఆత్మహత్యకు అప్పు, అధిక వడ్డీ, ఒత్తిళ్లే కారణమని సూసైడ్ నోట్ లో రాసి ఉరేసుకున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా అప్పు ఇచ్చిన తండ్రీకుమారుడు విఠల్ లోకేష్, జీవన్ ప్రసాద్ లపై పోలీసులు ఐపీసీ 306 కింద కేసు నమోదు చేశారు. మృతదేహాలకు మచిలీపట్నంలో పోస్టుమార్టం నిర్వహించి పెడనలో అంత్యక్రియలు పూర్తి చేశారు. పద్మనాభం కుమార్తె ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తల్లిని పెళ్లాడి.. కుమార్తెతో రొమాన్స్