ఈ మధ్య కాలంలో నవ వధువులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెళ్లి ఇష్టం లేక కొందరు, ప్రేమించిన వాడు దక్కలేదని మరి కొందరు. ఇలా ఇలాంటి కారణాలతో పెళ్లైన కొన్ని రోజులకే బలవన్మణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెం గ్రామం. రత్న కుమారి అనే మహిళను టంగుటూరి మండలం నందమూరి గ్రామానికి చెందిన సన్నికి ఇచ్చి నాలుగు నెలల కిందట వివాహం చేశారు. అయితే పెళ్ళైన కొన్ని రోజుల వరకు వీరి దాంపత్య జీవితం బాగానే సాగుతూ వచ్చింది. కొత్తగా పెళ్లైన జంట అంటూ అత్తింటి వాళ్లు సైతం మురిసిపోయారు. అయితే ఈ క్రమంలోనే నవ దంపతులు సంతోషంగా కాపురాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఉన్నట్టుండి భార్యాభర్తల నడుమ మనస్పర్ధలు పుట్టుకొచ్చాయి.
ఈ నెల 13న రత్నకుమారి భర్తతో సెల్ ఫోన్ కారణంగా గొడవలు చెలరేగాయి. దీంతో ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇక రత్నకుమారి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఏం చేయాలి తెలియక క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన నాలుగు నెలలకే నవ వధువు బలవన్మణానికి పాల్పడడంతో రత్నకుమారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.