ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెల్థారుపల్లిలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో హైటెన్షన్ మొదలైంది. వివరాల్లోకి వెళితే..
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగించుకొని తమ్మినేని కృష్ణయ్య బైకుపై ఇంటికి వెళ్తుండగా కొంతమంది వ్యక్తులు ఆటోతో ఆయన వాహనాన్ని బలంగా ఢీ కొట్టారు. కింద పడిపోయిన ఆయనపై వేట కొడవళ్లతో విరుచుకుపడ్డారు. ఆయన చనిపోయినట్టు నిర్ధారణ చేసుకొని అక్కడ నుంచి పారిపోయారు. కృష్ణయ్య మరణ వార్త తెలియడంతో ఆయన మద్దతుదాలు అక్కడకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
మృతి చెందిన కృష్ణయ్య సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు. గతంలో ఆయన సీపీఎం లో కీలక నేతగా పనిచేశారు. ఇటీవల టీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ప్రధాన అనుచరుడుగా కృష్ణయ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హత్యకు కారణం సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన పలువురు గ్రామస్తులు ఆరోపించారు. కృష్ణయ్యని అత్యంత పాశవికంగా చంపడంతో జీర్ణించుకోలేక ఆయన అనుచరులు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లికి వెళ్తుండగా ఒకే కుటుంబానికి చెందిన..!
ఇది చదవండి: గర్భవతి అనే కనికరం కూడా లేకుండా వరకట్నం కోసం..!